Wed Dec 25 2024 05:26:23 GMT+0000 (Coordinated Universal Time)
మహిళపై దారుణం.. భర్త ఇంట్లో లేని సమయంలో చొరబడి..
బాధిత మహిళ స్వస్థలం నాగర్ కర్నూల్ జిల్లా కోడూరు మండలంలోని ఓ గిరిజన తండా. మార్చి 13న తన భర్తతో తూప్రాన్ పేటకు..
చౌటుప్పల్ : పనికి వెళ్లిన రోజు తింటే.. వెళ్లని రోజు పస్తులుండాల్సిన గిరిజన కుటుంబం వారిది. అలాంటి కుటుంబంలోని మహిళపై కామాంధుడి కన్నుపడింది. పగలు భర్త పనికోసం బయటికి వెళ్లడం గమనించి.. ఓ దుండగుడు ఆ ఇంట్లోకి ప్రవేశించాడు. ఆ మహిళపై దారుణంగా అత్యాచారం చేశాడు. లైంగిక దాడి అనంతరం మహిళ అపస్మారక స్థితిలోకి వెళ్లినా.. వదల్లేదు ఆమెను. రెండోసారి అఘాయిత్యంతో ప్రాణాలు కోల్పోయింది. ఆ తర్వాత ఆమె కాలికున్న పట్టీలు, మెడలో ఉన్న బంగారు పుస్తెలను దోచుకుని అక్కడి నుంచి ఉడాయించాడు. వినడానికే దారుణంగా ఉన్న ఈ ఘటన చౌటుప్పల్ మండలం తూప్రాన్ పేటలో సోమవారం జరగ్గా.. ఆలస్యంగా వెలుగుచూసింది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బాధిత మహిళ స్వస్థలం నాగర్ కర్నూల్ జిల్లా కోడూరు మండలంలోని ఓ గిరిజన తండా. మార్చి 13న తన భర్తతో తూప్రాన్ పేటకు వలస వచ్చింది. ఇద్దరూ హైదరాబాద్ - విజయవాడ హైవే సమీపంలోని ఓ గాదాం వద్ద కాపలాదారులుగా పనిచేస్తు జీవనం సాగిస్తున్నారు. పగటి సమయంలో భర్త సమీపంలోని ఇంజినీరింగ్ కళాశాలలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. సోమవారం ఉదయం డ్యూటీకి వెళ్లిన భర్త.. తిరిగి ఇంటికి వచ్చేసరికి భార్య కనిపించలేదు. చుట్టుపక్కల వెతుకగా.. సమీపంలోని గడ్డివాము వద్ద రక్తపుమడుగులో అచేతన స్థితిలో కనిపించింది. వెంటనే భార్య తరపు బంధువులకు, పోలీసులకు సమాచారమిచ్చాడు. ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు.. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ ల ద్వారా ఆధారాలు సేకరించి, మృతదేహాన్ని పోస్టుమార్టమే కు పంపించారు.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. సేకరించిన ఆధారాలతో నిందితుడ్ని 24 గంటల్లోపే పట్టుకున్నారు. సంగారెడ్డి జిల్లాకు చెందిన 24 ఏళ్ల యువకుడే ఈ దారుణానికి పాల్పడినట్లు గుర్తించారు. తూప్రాన్ పేటలో సిమెంట్ ఇటుకల తయారీ పరిశ్రమలో పనిచేస్తున్న అతను.. మహిళ ఒంటరిగా ఉండటాన్ని గమనించి అత్యాచారానికి తెగబడినట్లు చౌటుప్పల్ ఏసీపీ తెలిపారు.
Next Story