Sun Dec 22 2024 21:48:46 GMT+0000 (Coordinated Universal Time)
కుమార్తె మారలేదు.. మారణశాసనం రాసిన తండ్రి
ఆగ్రహం వ్యక్తం చేసిన తండ్రి.. కుమార్తెను మారమని చెప్పినా మార్పు రాకపోవడంతో
తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. ఓ తండ్రి తన కుమార్తెను దారుణంగా హతమార్చాడు. తిరుచ్చి జిల్లా ఊరక్కరై గ్రామంలో తండ్రి తన కూతురిని గొంతునులిమి హత్య చేసిన ఘటన ఆ ప్రాంతంలో సంచలనంగా మారింది. కుమార్తె తన రిలేషన్ షిప్స్ తండ్రికి తెలియడం.. ఇష్టం వచ్చినట్లు తిరుగుతుండడం ఆమె తండ్రికి ఏ మాత్రం నచ్చలేదు. దీంతో ఆమెను హత్య చేశాడు. దేవారంపట్టి సమీపంలోని అటవీ ప్రాంతంలో ఓ యువతి మృతదేహం ఉన్నట్లు అటవీ శాఖ సిబ్బందికి తెలిసింది. పోలీసులు కేసు నమోదుచేసి విచారణ జరిపారు. మృతురాలు ఊరక్కరై గ్రామానికి చెందిన అరివళగన్ కుమార్తె ప్రియాంక అని తెలిసింది. ఆమె పద్దతి నచ్చని తండ్రి సహించలేకపోయాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన తండ్రి.. కుమార్తెను మారమని చెప్పినా మార్పు రాకపోవడంతో ఆమెను హతమార్చినట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు.
దేవరప్పంపట్టి అటవీ ప్రాంతంలోని 22వ రహదారి సమీపంలో ముళ్లపొద దగ్గర యువతి మృతదేహం పడి ఉన్నట్లు జెంబునాథపురం పోలీసులకు సమాచారం అందింది. సమాచారం అందుకున్న ముసిరి డిప్యూటీ సూపరింటెండెంట్ యాస్మిన్, ఇతర పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు.
తదుపరి విచారణలో ప్రియాంక తండ్రే తన కుమార్తెను హత్య చేసినట్లు తేలింది. ప్రియాంక ఎప్పుడూ దురుసుగా ప్రవర్తించేదని తండ్రి వాంగ్మూలం ఇచ్చాడు. నమక్కల్ వెళ్లి బంధువు దగ్గరి నుంచి తెచ్చుకున్న మోటార్‌సైకిల్‌పై ప్రియాంకను తెరపంబట్టి అడవి ప్రాంతం నుండి తీసుకుని వెళ్లానని తెలిపాడు. అక్కడ మోటార్‌సైకిల్‌ను ఆపి ప్రియాంకను కొట్టి అడవిలోకి ఈడ్చుకెళ్లి ఆమెకు ఊపిరాడకుండా చేసి చంపానని తెలిపాడు. తర్వాత మోటార్‌సైకిల్‌పై ఇంటికి వెళ్లాను. నా కోసం పోలీసులు వెతుకుతున్నారని తెలిసి, అపరాధభావంతో లొంగిపోయానని విచారణలో తెలిపాడు.
Next Story