Mon Dec 23 2024 10:56:12 GMT+0000 (Coordinated Universal Time)
బాలికపై లైంగిక దాడి.. టీఆర్ఎస్ నేతపై పోక్సో యాక్ట్
ఆమెను రహస్య ప్రాంతాలకు తీసుకెళ్లి.. లైంగికదాడికి పాల్పడినట్లు సమాచారం. సాజిద్ ఖాన్ ఆగడాలను భరించలేని..
నిర్మల్ : బాలికపై లైంగిక దాడికి పాల్పడిన టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధిపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదైంది. నిర్మల్ జిల్లా కేంద్రంలోని వైఎస్సార్ నగర్ కాలనీలో జరిగిందీ ఘటన. టీఆర్ఎస్ పార్టీకి చెందిన నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ సాజిద్ ఖాన్ బాలికపై లైంగిదాడికి పాల్పడ్డాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు సాజిద్ ఖాన్ పై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
సాజిద్ ఖాన్ కొద్దిరోజులుగా బాలికపై అత్యాచారం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆమెను రహస్య ప్రాంతాలకు తీసుకెళ్లి.. లైంగికదాడికి పాల్పడినట్లు సమాచారం. సాజిద్ ఖాన్ ఆగడాలను భరించలేని బాలిక శనివారం సాయంత్రం నిర్మల్ గ్రామీణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. విషయం వెలుగుచూసింది. బాలికను సఖి సెంటర్ కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు.
Next Story