Sat Jan 11 2025 14:45:27 GMT+0000 (Coordinated Universal Time)
బీర్ బాటిల్ తో మహిళ గొంతు కోసి.. చేయి విరిచేసి..
తనతో వీడియో కాల్స్ మాట్లాడకపోతే చంపేస్తానని బెదిరించాడు. ఈ విషయం మహిళ తన భర్తకు చెప్పగా.. అతను విజయ్ పై ..
ఓ మహిళపై మనసు పడ్డాడు. తన కోరిక తీర్చాలని వేధించాడు. వినకపోయే సరికి ఆమె గొంతు కోసేసాడు. ఈ దుర్ఘటన హైదరాబాద్ లోని బేగంపేట్ కుందన్ బాగ్ కాలనీ, బీఎస్ మక్తాలో చోటుచేసుకుంది. ఈవెంట్స్ లో పనిచేస్తున్న ఓ మహిళ భర్త సూరజ్ తో కలిసి నివాసం ఉంటోంది. ఇటీవల కాలంలో ఆమెకు జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే పీఏ గా పనిచేస్తున్న విజయ్ సింహతో ఫేస్ బుక్ లో పరిచయం ఏర్పడింది. రోజూ చాటింగ్ లో మాట్లాడుకునేవారు. స్నేహం పెరుగుతుండగా.. వీడియో కాల్స్ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.
సదరు మహిళ వీడియో కాల్ లో మాట్లాడటాన్ని విజయ్ అడ్వాంటేజ్ గా తీసుకున్నాడు. న్యూడ్ కాల్స్ చేయడం మొదలు పెట్టాడు. తనతో వీడియో కాల్స్ మాట్లాడకపోతే చంపేస్తానని బెదిరించాడు. ఈ విషయం మహిళ తన భర్తకు చెప్పగా.. అతను విజయ్ పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సోమవారం ఉదయం విజయ్ ఏకంగా మహిళ ఇంట్లోకి వెళ్లి తన కోరికను తీర్చాలని వేధించాడు. అందుకు ఆమె నిరాకరించడంతో.. బీర్ బాటిల్ ను పగలగొట్టి .. గొంతు కోసేశాడు. అంతటితో ఆగలేదు. విజయసింహతో వచ్చిన మరో వ్యక్తి మహిళ చేయి విరిచేశాడు.
వెంటనే మహిళ.. భర్త సూరజ్ కు వీడియో కాల్ చేసి.. విషయం చెప్పగా అతను ఆగమేఘాలమీద ఇంటికి చేరుకున్నాడు. భార్య ఉన్న పరిస్థితి చూసి షాకయ్యాడు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించి, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనను వదిలేసి రావాలని, లేదంటే చంపేస్తానని.. విజయసింహ చాలాసార్లు తన భార్యను బెదిరించినట్లు పోలీసులకు తెలిపాడు.
Next Story