Mon Dec 23 2024 08:29:34 GMT+0000 (Coordinated Universal Time)
Ys Viveka : వివేకా హత్య కేసులో కీలక మలుపు.. సునీతపై కేసు నమోదు
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక మలుపు సంభవించిది. వైఎస్ సునీత, ఎస్పీ రాంసింగ్ పై పులివెందులలో కేసు నమోదయింది
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక మలుపు సంభవించిది. వైఎస్ సునీత, రాజశేఖర్ రెడ్డి, ఎస్పీ రాంసింగ్ పై పులివెందులలో కేసు నమోదయింది. కోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు నమోదయింది. తనను బెదిరిస్తున్నారంటూ వీరిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో వైఎస్ వివేకానందరెడ్డి పీఏ కృష్ణారెడ్డి పులివెందుల కోర్టును ఆశ్రయించారు. కొందరి పేర్లను చెప్పాలని తనను సీబీఐ ఎస్పీ రాంసింగ్ తో పాటు సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి బెదిరించినట్లు కృష్ణారెడ్డి న్యాయస్థానంలో వేసిన పిటీషన్ లో పేర్కొన్నారు.
రక్షణ కల్పించాలని కోరినా...
తాను పోలీసులకు కలసి రక్షణ కల్పించాలని కోరినా పట్టించుకోలేదని, అందుకే తాను న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చిందని పీఏ కృష్ణారెడ్డి తెలిపారు. సీబీఐ అధికారులకు అనుకూలంగా సాక్ష్యం చెప్పకపోతే తనను చంపేస్తామని బెదిరించారని కూడా ఆయన ఆరోపించారు. దీనిపై విచారణ చేసిన పులివెందుల న్యాయస్థానం సునీత, రాజశేఖర్ రెడ్డితో పాటు సీబీఐ ఎస్పీ రాంసింగ్ పై కూడా కేసు నమోదు చేయాలని ఆదేశించింది. దీంతో వీరిపై ఐపీసీ సెక్షన్ 156 (3) కింద కేసు నమోదు చేశారు.
Next Story