Mon Dec 23 2024 09:01:35 GMT+0000 (Coordinated Universal Time)
టీవీ నటుడు చంద్రకాంత్ బలవన్మరణం
టీవీ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన త్రినయని సీరియల్్ తో పాటు అనేక సీరియల్స్ లో నటిస్తున్నారు.
టీవీ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన త్రినయని సీరియల్్ తో పాటు అనేక సీరియల్స్ లో నటిస్తున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల వారికి దూరంగా ఉంటున్నారు. అయితే నాలుగు రోజుల క్రితం ఇదే సీరియల్ లో నటిస్తున్న పవిత్ర జయరాంతో కలసి బెంగళూరు నుంచి కారులో వస్తుండగా జరిగిన ప్రమాదంలో పవిత్ర మరణించిన సంగతి తెలిసిందే.
మానసికంగా...
అయతే పవిత్ర మరణాన్ని తట్టుకోలేని చంద్రకాంత్ మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఆయన శుక్రవారం మధ్యాహ్నం మణికొండలోని అపార్ట్మెంట్ లో తన ఫ్లాట్ లో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. స్నేహితులు ఫోన్ చేస్తే స్పందించకపోవడంతో అక్కడకు వచ్చి చూడగా ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు కనిపించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story