Wed Dec 25 2024 20:28:41 GMT+0000 (Coordinated Universal Time)
టీవీ రిమోట్ .. ఒక ప్రాణం తీసింది.. ఎలా అంటే?
టీవీ సీరియల్ ఒక ప్రాణం తీసింది. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరులో ఈ ఘటన జరిగింది
ఇప్పుడు టీవీ లేనిదే ముద్ద దిగడం లేదు. మొబైల్ లేనిదే పొద్దు గడవడం లేదు. భార్యాభర్తలు ఇంట్లోనే ఉన్నా ఒకరితో ఒకరు కష్టసుఖాలు మాట్లాడుకునే రోజులు పోయాయి. ఎవరి ధోరణి వారిది. కొందరు మొబైల్లో నిమగ్నమవుతుంటే.. మరికొందరు టీవీ సీరియల్స్ ను చూస్తూ కాలం గడిపేస్తున్నారు. దంపతుల మధ్య దూరం పెంచిన టీవీ, మొబైల్స్ ను వదిలి పెట్టేందుకు ఎవరూ సిద్ధపడటం లేదు. అదే ఒకరి ప్రాణం తీసింది. తమిళనాడు రాష్ట్రంలోని తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరులో ఒక విషాదం చోటు చేసుకుంది.
సీరియల్స్ మార్చమంటూ...
భార్య నిషా, భర్త ఆశీర్వాదం కడంబత్తూరులో కలసి జీవిస్తున్నారు. అయితే ఆశీర్వాదం ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే సరికి భార్య నిషా తనకు ఇష్టమైన సీరియల్ చూస్తుంది. అయితే ఛానల్ మార్చాలంటూ భార్య నిషాను ఆశీర్వాదం కోరారు. ఆమె నిరాకరించింది. కోపమొచ్చిన ఆశీర్వాదం భార్య నిషాతో గొడవపడ్డారు. దీంతో భార్య నిషాకు కోపమొచ్చి పుట్టింటికి వెళ్లింది. భార్య పుట్టింటికి వెళ్లడంతో ఆశీర్వాదం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒక సీరియల్ ఒక ప్రాణం తీసిందని, అంత పిచ్చి ఎవరికీ పనికి రాదని మానసిక విశ్లేషకులు చెబుతున్నారు.
Next Story