Mon Dec 23 2024 17:14:28 GMT+0000 (Coordinated Universal Time)
బీమా డబ్బుల కోసం డ్రామా
మెదక్ జిల్లా కారు సజీవ దహనం కేసులో ట్విస్ట్ ను కనుగొన్నారు. బీమా డబ్బుల కోసం డ్రామా ఆడినట్లు దర్యాప్తులో తేలింది
మెదక్ జిల్లా కారు సజీవ దహనం కేసులో ట్విస్ట్ ను పోలీసులు కనుగొన్నారు. బీమా డబ్బుల కోసం ఈ డ్రామా ఆడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. సెక్రటేరియట్ ఉద్యోగి ధర్మానాయక్ ఈ నెల 9న కారు ప్రమాదంలో చనిపోయినట్లు నాటకం ఆడారు. దీంతో కుటుంబ సభ్యులు కారులో దొరికిన మృతదేహానికి అంత్యక్రియలను నిర్వహించారు. అయితే ప్రమాద స్థలంలో పెట్రోలు డబ్బా దొరకడంతో పోలీసులకు అనుమానమొచ్చి దర్యాప్తు చేయగా అసలు విషయం బయటపడింది.
ఏడు కోట్ల బీమా సొమ్ము కోసం...
తన పేరు మీద ఉన్న ఏడు కోట్ల ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ధర్మానాయక్ ఈ డ్రామా ఆడినట్లు తెలిసింది. ధర్మానాయక్ బెట్టింగ్ ల కోసం రెండు కోట్ల వరకూ అప్పులు చేశాడు. అప్పులు తీర్చేందుకు తన అల్లుడితో కలసి డ్రామాకు ప్లాన్ చేశాడు. ఒక సెకండ్ హ్యాండ్ కారును కొనుగోలు చేసి డ్రైవర్ ను పెట్టుకున్నారు. డ్రైవర్ ను హత్య చేసి కారు ప్రమాదంలో తాను చనిపోయినట్లు నమ్మించాడు. ఈ స్కెచ్ ను పక్కాగా వేసి తర్వాత పూనేకు పారిపోయాడు.
పెట్రోలు డబ్బాయే పట్టించింది....
అయితే కారు పక్కన దొరికిన పెట్రోలు డబ్బా దొరకడంతో అనుమానించిన పోలీసులు కేసు విచారణ చేపట్టారు. బీమా సొమ్ముల కోసమే ధర్మా నాయక్ ఈ నాటకాన్ని ఆడినట్లు పోలీసులు కనుగొన్నారు. ధర్మానాయక్ ను పూనేలో అరెస్ట్ చేసిన పోలీసులు ప్రస్తుతం విచారిస్తున్నారు. ఈ నెల 9న కారు ప్రమాదం జరగగా, ఐదు రోజుల్లోనే మిస్టరినీ పోలీసులు ఛేదించారు. రేపు మీడియా ఎదుట ధర్మానాయక్ ను ప్రవేశ పెట్టనున్నారు.
Next Story