Mon Dec 23 2024 07:27:12 GMT+0000 (Coordinated Universal Time)
ఇవేం ట్విస్టులు.. అప్సర భర్త ఆత్మహత్య, వైరల్ అవుతున్న ఆడియో
చెన్నైకి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కార్తీక్ రాజా.. అప్సరను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లైన కొద్దిరోజులకే అప్సర
సరూర్ నగర్ లోని బంగారు మైసమ్మ తల్లి ఆలయంలో అర్చకుడిగా ఉన్న అయ్యగారి వెంకట సాయి సూర్యకృష్ణ.. అప్సర (30) అనే మహిళను అతిదారుణంగా హతమార్చి.. ఆమె మృతదేహాన్ని మ్యాన్ హోల్ లో పడేసి.. ఆ తర్వాత కనిపించడం లేదని హైడ్రామా ఆడిన విషయం తెలిసిందే. మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా సాయికృష్ణే నిందితుడని తేల్చిన పోలీసులు.. అతడిని విచారించగా అప్సరను తానే చంపినట్లు నేరాన్ని అంగీకరించాడు. ప్రస్తుతం సాయికృష్ణ చర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. పెళ్లిచేసుకోవాలని వేధించడంతోనే ఆమెను చంపినట్లు చెబుతున్నాడు.
అప్సర హత్యకేసు వెలుగుచూసిన దగ్గరి నుండి రోజుకో ట్విస్టు బయటపడుతుంది. ఇవన్నీ చూస్తుంటే.. అసలు అప్సర క్యారెక్టర్ ఏంటన్న అనుమానం రాకపోదు. నిన్న అప్సరకు గతంలోనే పెళ్లైందంటూ కొన్ని ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. అయితే భర్తతో విభేదాల కారణంగా ఏడాది కాలంగా పుట్టింట్లోనే ఉంటుందని, ఈ క్రమంలోనే సాయికృష్ణతో పరిచయం ఏర్పడి అక్రమ సంబంధానికి దారితీసిందంటూ వార్తలొచ్చాయి. తాజాగా మరో ట్విస్ట్ తెరపైకి వచ్చింది. అప్సరకు గతంలో పెళ్లైన మాట నిజమే. అది ప్రేమ వివాహం అట. అయితే అప్సర వల్లే తనకొడుకు సూసైడ్ చేసుకున్నాడని అతని తల్లి మాట్లాడిన ఆడియో ఒకటి వైరల్ అవుతోంది.
చెన్నైకి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కార్తీక్ రాజా.. అప్సరను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లైన కొద్దిరోజులకే అప్సర తనను టూర్లకు, విహారయాత్రలకు తీసుకెళ్లాలని వేధించేదని కార్తీక్ తల్లి ధనలక్ష్మి ఆడియోలో పేర్కొన్నారు. లగ్జరీ లైఫ్ కోసం అప్సర తన కొడుకుని హింసించేదని, అప్సర, ఆమె తల్లి అరుణ కార్తీక్ రాజాను తీవ్రంగా వేధింపులకు గురిచేశారని వాపోయారు. మానసికంగా వేధించడమే కాకుండా.. తన కొడుకుపై కేసు పెట్టి జైలుకు కూడా పంపారని, అవమాన భారంతో అతను ఆత్మహత్య చేసుకున్నాడని పేర్కొన్నారు. తన కొడుకు ఆత్మహత్యకు కారణం వాళ్ల వేధింపులేనన్నారు. కార్తీక్ రాజా చనిపోయాక అప్సర, ఆమె తల్లి కనిపించలేదన్నారు.
ధనలక్ష్మి విడుదల చేసిన ఆడియోలోని మాటలు.. సాయికృష్ణ తండ్రి చేసిన ఆరోపణలకు బలం చేకూర్చే విధంగా ఉన్నాయి. మూడు నెలలుగా అప్సర తన కొడుకు సాయికృష్ణను తీవ్రంగా వేధించిందని, ఆమె టార్చర్ తట్టుకోలేకపోతున్నానని అతను చెప్పాడని సాయికృష్ణ తండ్రి ఇటీవల మీడియాకు తెలిపారు. ఈ నేపథ్యంలో పోలీసులు అప్సర బ్యాగ్రౌండ్ పై విచారణ చేస్తున్నారు.
Next Story