Mon Dec 23 2024 10:27:00 GMT+0000 (Coordinated Universal Time)
ఎయిర్ పోర్టుల్లో భారీగా బంగారం, విదేశీ కరెన్సీ స్వాధీనం
ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఒక విదేశీ ప్రయాణికుడి నుంచి రెండు కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు
ఎయిర్ పోర్టుల్లో భారీ ఎత్తున బంగారం, విదేశీ కరెన్సీ బయటపడుతుంది. తాజాగా ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఒక విదేశీ ప్రయాణికుడి నుంచి రెండు కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా 75 లక్షల విలువైన విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. షార్జా నుంచి వస్తున్న ఒక ప్రయాణికుడి నుంచి ఈ బంగారాన్ని, విదేశీ కరెన్సీని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ముంబయి ఎయర్ పోర్టులో....
అదే సమయంలో ముంబయి ఎయిర్ పోర్టులోనూ దాదాపు రెండు కోట్ల విలువైన విదేశీ కరెన్సీని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సూడాన్ నుంచి వస్తున్న నలుగురు ప్రయాణికుల నుంచి ఈ విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని కస్టమ్స్ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
Next Story