Thu Dec 19 2024 14:38:15 GMT+0000 (Coordinated Universal Time)
స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకల్లో అపశృతి.. జెండా ఎగురవేస్తూ ఇద్దరు మృతి
తెలంగాణలో మువ్వన్నెల జెండా ఎగురవేస్తుండగా.. ఇద్దరు వ్యక్తులు కరెంట్ షాక్ తో మృతి చెందారు. సంగారెడ్డి జిల్లాలో..
దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కుల, మతాలకు అతీతంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జరుపుకున్నారు ప్రజలు. ఎంతో ఆనందంగా, సంబరంగా జరుపుకుంటున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. తెలంగాణలో మువ్వన్నెల జెండా ఎగురవేస్తుండగా.. ఇద్దరు వ్యక్తులు కరెంట్ షాక్ తో మృతి చెందారు. సంగారెడ్డి జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని సోమవారం ఉదయం అనిల్ కుమార్ (40), తిరుపతి (42), ధనంజయ (38)అనే ముగ్గురు వ్యక్తులు మువ్వన్నెల పతాకాన్ని ఆవిష్కరిస్తున్నారు. ఈ క్రమంలో జెండా కర్ర 11కేవీ విద్యుత్ వైర్లకు తగలడంతో.. అనిల్, తిరుపతి, ధనంజయలకి విద్యుత్ షాక్ తగిలింది. అనిల్, తిరుపతి అక్కడికక్కడే మృతి చెందగా.. ధనంజయకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పటాన్ చెరు పోలీసులు మృతదేహాల్ని సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసుకున్నారు.
Next Story