Wed Apr 23 2025 10:52:24 GMT+0000 (Coordinated Universal Time)
Mumbai : రెండు రోజుల పాటు కారులోనే మృతదేహాలు.. హోర్డింగ్ కూలిన ఘటన
ముంబయిలో హోర్డింగ్ కూలిన ఘటనలో మరో రెండు మృతదేహలు బయటపడ్డాయి

ముంబయిలో హోర్డింగ్ కూలిన ఘటనలో మరో రెండు మృతదేహలు బయటపడ్డాయి. దీంతో మృతుల సంఖ్య పదహారుకు చేరుకుంది. ఇటీవల గాలివానతో ముంబయిలోని ఘాట్కోపర్ వద్ద హోర్డింగ్ కుప్పకూలి పథ్నాలుగు మంది మరణించిన సంగతి తెలిసిందే. అయితే హోర్డింగ్ కింద ఉన్న శిధిలాలను తొలగిస్తుండగా కారులో మరో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. వారు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రిటైర్డ్ మేనేజర్ మనో చన్సోరియా, ఆయన భార్య గా పోలీసులు గుర్తించారు. సోమవారం సాయంత్రం వీచిన ఈదురుగాలులకు ముంబయిలోని ఘాట్ కోపర్ వద్ద హోర్డింగ్ పడటంతో దాని కింద ఉన్న వారు మరణించారు.
వాళ్లిద్దరూ వీసా కోసం...
అయితే శిధిలాలను తొలగించే ప్రక్రియలో సిబ్బందికి కారులో ఉన్న మృతదేహాలను చూసి అవాక్కయ్యారు. మనోజ్ చన్సోరియా రెండు నెలల క్రితమే పదవీ విరమణ చేశారని వారు బంధువులు తెలిపారు. వారు ఉండేది జబల్పుర్ లో. అయితే వీసా కోసం కారులో ిఇక్కడకు వచ్చారు. వీసా పని పూర్తి చేసుకుని తిరిగి జబల్పుర్ వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పెట్రోలు బంకు వద్ద ఆగిన వీరి కారు హోర్డింగ్ పడటంతో అందులో చిక్కుకుపోయింది. వారి కుమారుడు అమెరికాలో ఉన్నాడు. ఫోన్ చేసినా వారు స్పందించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే కారులో దంపతులిద్దరూ శవమై కన్పించారు.
Next Story