Fri Dec 20 2024 21:55:02 GMT+0000 (Coordinated Universal Time)
ఏనుగు దాడిలో.. ఇద్దరు మృతి
కర్ణాటకలో దారుణం చోటు చేసుకుంది. ఏనుగు దాడిలో ఇద్దరు మృతి చెందారు. కాఫీ ఎస్టేట్ కార్మికులపై ఏనుగు దాడి చేసింది.
కర్ణాటకలో దారుణం చోటు చేసుకుంది. ఏనుగు దాడిలో ఇద్దరు మృతి చెందారు. కాఫీ ఎస్టేట్ కార్మికులపై ఏనుగు దాడి చేసింది. కర్ణాటకలోని హసన్ జిల్లా లోని కడగెర్జీ గ్రామంలో శారద ఎస్టేట్ కాఫీ తోట ఉంది. ఇక్కడ నిత్యం కార్మికులు పనిచేస్తుంటారు. అయితే ఉన్నట్లుండి ఏనుగు వచ్చి కాఫీ తోటలపైకి రావడంతో దానిని అదిలించే క్రమంలో ఈ ఘటన జరిగినట్లు తెలిసింది.
కాఫీ ఎస్టేట్ లో....
మృతులు చిక్కయ్య, ఎర్రయ్యలుగా గుర్తించారు. హసన్ జిల్లాలో ఏనుగుల దాడి ఎక్కువగా జరుగుతుందని ఆ ప్రాంత ప్రజలు ఆరోపిస్తున్నారు. బయటకు రావాలంటేనే భయమేస్తుందని చెబుతున్నారు. గ్రామాల్లోకి అటవీ జంతువులు రాకుండా అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Next Story