Mon Dec 23 2024 15:17:26 GMT+0000 (Coordinated Universal Time)
జగిత్యాలలో కారుప్రమాదం విషాదాంతం.. ఇద్దరు మృతి
కారును కొద్దిసేపటిక్రితమే రెస్క్యూ సిబ్బంది బయటికి తీశారు. మెట్ పల్లి మండలం వెల్లుల్ల వద్ద జరిగిన ఈ ప్రమాదంలో రేవంత్, ప్రసాద్ అనే
జగిత్యాల జిల్లాలో నిన్న రాత్రి జరిగిన కారుప్రమాదం విషాదాంతంగా మారింది. సోమవారం రాత్రి కారు ప్రమాదవశాత్తు కాకతీయ కాల్వలో పడిపోయినట్లుగా పోలీసులు గుర్తించారు. ఆ కారును కొద్దిసేపటిక్రితమే రెస్క్యూ సిబ్బంది బయటికి తీశారు. మెట్ పల్లి మండలం వెల్లుల్ల వద్ద జరిగిన ఈ ప్రమాదంలో రేవంత్, ప్రసాద్ అనే ఇద్దరు యువకులు నీటిలో మునిగి మృతి చెందారు. వీరిద్దరూ మెట్ పల్లికి చెందినవారుగా గుర్తించారు పోలీసులు. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మెట్ పల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
Also Read : రావత్ హెలికాప్టర్ ప్రమాదానికి కారణాలివే?
సోమవారంరాత్రి వెల్లుల్ల వైపుగా వెళ్తున్న కారు ఉన్నట్లుండి మిస్సయింది. మెట్ పల్లి ఎంట్రీపాయింట్ వద్ద ఉన్న సీసీ కెమెరాలో కారు వెల్లుల్ల వైపుగా వెళ్తున్నట్లు గుర్తించిన పోలీసులు.. ఆ కారు గ్రామానికి చేరుకోలేదని తెలుసుకున్నారు. దీంతో కారు ఆచూకి కోసం వెతుకగా.. కాకతీయ కాల్వ సమీపంలో కారు సైడ్ మిర్రర్స్ పడి ఉన్నాయి. దాంతో కారు కాల్వలో పడిపోయి ఉంటుందని గ్రహించి.. వెంటనే శ్రీరాం సాగర్ నుంచి వచ్చే నీటిని ఆపివేసి, సహాయక చర్యలు ప్రారంభించారు. భారీ క్రేన్ సహాయంతో కారును నీటిలోంచి బయటికి తీసి, రెండు మృతదేహాలను పోస్టుమార్టం కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read : ఏపీ ఇప్పట్లో కోలుకోవడం కష్టమే
Next Story