Thu Dec 19 2024 14:38:57 GMT+0000 (Coordinated Universal Time)
ట్రాఫిక్ క్లియర్ చేస్తుండగా...?
ట్రాఫిక్ క్లియర్ చేస్తుండగా వ్యాన్ వచ్చి ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. అందులో హోంగార్డు కూడా ఉన్నారు.
ట్రాఫిక్ క్లియర్ చేస్తుండగా ఒక వ్యాన్ వచ్చి ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. అందులో హోంగార్డు కూడా ఒకరు ఉన్నారు. గుంటూరు జిల్లా యనమదల వద్ద ఈ ప్రమాదం జరిగింది. యనమదల వద్ద ఆగిఉన్న లారీని వేగంగా వచ్చిన మరో లారీ ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందారు.
ముగ్గురి మృతి,,,
దీంతో అక్కడ స్థానికులు గుమిగూడారు. ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడటంతో ఒక హోంగార్డు ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు వచ్చారు. అయితే అదే సమయంలో వేగంగా వచ్చిన ఒక పాల వ్యాన్ హోంగార్డుతో సహా, మరో వ్యక్తిని ఢీకొనింది. ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హోంగార్డు కుటుంబానికి ప్రభుత్వం సాయం చేయాలని కోరుతున్నారు.
Next Story