Mon Dec 23 2024 09:58:38 GMT+0000 (Coordinated Universal Time)
విషాదం నింపిన సరదా.. ఈతకొడదామని గోదావరిలో దిగి..
స్నానం చేద్దామని రేవులో దిగారు. అయితే అక్కడ ఊబి ఉందని గ్రహించలేకపోయిన రాహుల్, రోహిత్ లో అందులో చిక్కుకున్నారు. తోటి..
చెముడులంక : గోదావరిలో ఈతకొట్టాలన్న వారి సరదా.. రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆదివారం సెలవురోజు కావడంతో స్నానం చేసేందుకు గోదావరిలో దిగారు స్నేహితులు. అయితే అక్కడ ఊబి ఉందన్న విషయం గమనించకపోవడంతో.. ఇద్దరు యువకులు తమ స్నేహితుల కళ్లెదుటే ఊబిలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన తూర్పు గోదావరి జిల్లా బడుగువానిలంకలో జరిగింది. ఆదివారం స్కూల్ కి సెలవు కావడంతో.. చెముడులంకకు చెందిన రాహుల్, రోహిత్, చొప్పెళ్లకు చెందిన జినేంద్ర, వినయ్, కౌశిక్ లు గోదావరిలో ఈత కొట్టేందుకు బైక్ పై బడుగువానిలంక రేవు వద్దకు వెళ్లారు.
స్నానం చేద్దామని రేవులో దిగారు. అయితే అక్కడ ఊబి ఉందని గ్రహించలేకపోయిన రాహుల్, రోహిత్ లో అందులో చిక్కుకున్నారు. తోటి స్నేహితులు అప్రమత్తమై వారిని కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఊబిలో మునిగిపోయిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టగా.. తొలుత రాహుల్, ఆ తర్వాత రోహిత్ మృతదేహాలు లభ్యమయ్యాయి. అప్పటి వరకూ తమ కళ్లెదుటే తిరిగిన ఆ ఇద్దరూ ఇక లేరన్న విషయం తెలిసి.. చెముడులంక గ్రామంలో విషాదం నెలకొంది. కాగా.. రాహుల్ కు తండ్రి లేరు. తల్లి దుబాయ్ లో ఉంటుండగా.. అమ్మమ్మ వద్ద ఉండి రాహుల్ చదువుకుంటున్నాడు.
Next Story