Mon Dec 23 2024 05:23:53 GMT+0000 (Coordinated Universal Time)
America : రోడ్డు ప్రమాదంలో తెలంగాణ విద్యార్థుల మృతి
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలంగాణకు చెందిన విద్యార్థులు మరణించారు
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలంగాణకు చెందిన విద్యార్థులు మరణించారు. భారత కాలమాన ప్రకారం నిన్న మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేేసుకుంది. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ కు చెందిన గౌతమ్ కుమార్, కరీంనగర్ జిల్లా హుజూర్ నగర్ కు చెందిన ముక్క నివేశ్ అమెరికాలోని అరిజోనా స్టేట్ వర్సిటీలో చదువుతున్నారు.
వాటర్ ఫాల్స్ కు వెళుతుండగా...
వీకెండ్ లో వీరిద్దరూ స్నేహితులతో కలసి కారులో వెళుతుండగా ఈ ప్రమాదం జరిగంది. వీరు ప్రయాణించే కారును మరో ట్రక్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందిని తెలిపారు. గౌతమ్, నివేశ్ అక్కడికక్కడే మరణించగా మరికొందరికి గాయాలయ్యాయి. వీరంతా వాటర్ ఫాల్స్ చూసేందుకు వెళుతున్నారని తెలిసింది. దీనిపై అరిజోనా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు విద్యార్థుల మరణంతో వారి కుటుంబంలో విషాద చాయలు అలుముకున్నాయి.
Next Story