Mon Dec 23 2024 06:51:34 GMT+0000 (Coordinated Universal Time)
Nizamabad: నిజామాబాద్ లో కలకలం.. రైలు పట్టాల పక్కన మృతదేహాలు
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాల పక్కన
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాల పక్కన శనివారం అర్థరాత్రి రెండు గుర్తుతెలియని మృతదేహాలు లభ్యమయ్యాయి. రైల్వే ట్రాక్ పక్కన పడి ఉన్న రెండు మృతదేహాలను స్థానికులు గుర్తించి డిచ్పల్లి పోలీసులకు సమాచారం అందించారు. ముప్పై ఏళ్ల వయసున్న ఇద్దరు వ్యక్తులు రైలు ఢీకొని మరణించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదు.
ఇందల్వాయి రైల్వే స్టేషన్ సమీపంలోని రైలు పట్టాల పక్కన శనివారం రెండు మృతదేహాలు లభ్యమయ్యాయని రైల్వే ఎస్సై సాయారెడ్డి తెలిపారు. రైల్వే ట్రాక్ వద్ద స్థానికులకు రెండు మృతదేహాలు కనిపించడంతో డిచ్పల్లి పోలీసులకు సమాచారమిచ్చారు. ఎస్సై మనోజ్కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. మృతుల వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు.
Next Story