Mon Dec 23 2024 08:48:57 GMT+0000 (Coordinated Universal Time)
తిరుపతి బస్టాండ్లో బాలుడు మిస్సింగ్
తిరుపతిలో రెండేళ్ల బాలుడు అదృశ్యమయ్యాడు. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్లో ఈ ఘటన చోటు చేసుకుంది
తిరుపతిలో రెండేళ్ల బాలుడు అదృశ్యమయ్యాడు. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్లాట్ఫార మూడు వద్ద ఉన్న బాలుడు మిస్ కావడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం తిరుగు ప్రయాణానికి చెన్నైకి చెందిన ఒక కుటుంబం తిరుపతికి చేరుకుంది. అక్కడ బస్ కోసం వెయిట్ చేస్తుంది.
చెన్నైకి చెందిన...
చెన్నైకి చెందిన రామస్వామి చంద్రశేఖర్ కుమారుడు అరుల్ మురుగన్ మిస్ అయ్యాడు.. అరుల్ మురుగన్ వయసు రెండేళ్లు. అయితే పోలీసులు సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించగా అంబేద్కర్ విగ్రహం సర్కిల్ వద్ద ఉన్న కేన్సన్ హోటల్ వైపు వెళ్లినట్లు చూపింది. దీంతో పోలీసులు అప్రమత్తమై మిస్ అయిన బాలుడి కోసం వెదుకుతున్నారు.
Next Story