Sun Dec 22 2024 06:27:23 GMT+0000 (Coordinated Universal Time)
బాలికపై అత్యాచారం.. లైవ్ స్ట్రీమింగ్
బాలికపై అత్యాచారం చేయడమే కాకుండా..లైవ్ స్ట్రీమింగ్
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ జిల్లాలో 18 ఏళ్ల బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులలో ఒకరు లైవ్ స్ట్రీమింగ్ కూడా చేశారు. లైంగిక వేధింపులను వీడియో కాల్లో 'లైవ్ స్ట్రీమ్' చేశారు. ఆ తర్వాత ఆమెను బ్లాక్మెయిల్ చేశారు. సదరు యువకులపై కూడా కేసు నమోదు చేశారని పోలీసులు తెలిపారు. గత సంవత్సరం జూన్‌లో బాలిక పాఠశాలలో చదువుతున్నప్పుడు ఈ సంఘటన జరిగినప్పటికీ, భయంతో ఆమె మౌనంగా ఉండిపోయింది. ఫిర్యాదు ఆధారంగా, పోలీసులు ఇద్దరు యువకులను వివేక్ యాదవ్, లాలూ సాహుగా గుర్తించారు. అత్యాచారం మరియు నేరపూరిత బెదిరింపుల కింద కేసు నమోదు చేశారు. ఇద్దరు నిందితులు ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.
బాలిక తల్లిదండ్రులు ఆమెకు నిశ్చితార్థం చేయగా, నిందితులు ఆమె చిత్రాలు, వీడియోలను ఆమె కాబోయే భర్త కుటుంబ సభ్యులతో పంచుకోవడంతో ఈ విషయం ఇటీవల వెలుగులోకి వచ్చింది. దీంతో వెంటనే నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నారు. నిశ్చితార్థం రద్దు కావడంతో తమ కుమార్తెకు ఎదురైన కష్టాల గురించి తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు, పోలీసులను ఆశ్రయించాలని నిర్ణయించుకున్నారు. నిందితుడు తొలుత బాలికతో స్నేహం చేసి ఏకాంత ప్రదేశానికి పిలిచాడని విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. తమ కోరికను తీర్చేందుకు నిరాకరిస్తే సోదరుడిని, తండ్రిని చంపేస్తామని బెదిరించారు. ఆ తర్వాత నిందితుల్లో ఒకరైన లాలూ ఆమెను ఓ హోటల్‌కు తీసుకెళ్లాడు. అతను తన స్నేహితుడికి వీడియో కాల్ చేసాడు, వివేక్ అత్యాచారాన్ని ప్రత్యక్షంగా వీక్షించాడు. వివేక్ వీడియో కాల్ సమయంలో స్క్రీన్షాట్లు తీయడమే కాకుండా.. రికార్డ్ కూడా చేశాడు. తరువాత వారు ఆమెను బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించడంతో, ఆమె ఝాన్సీ రోడ్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి వారిపై ఫిర్యాదు చేసింది. అయితే అప్పట్లో రేప్ ప్రస్తావన రాలేదు. నిశ్చితార్థం రద్దు కావడంతో, ఆమె తన తల్లిదండ్రులకు జరిగిన విషయం తెలిపింది. నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు.
News Summary - Shocking! Two youths rape woman, live-stream crime to friend in Madhya Pradesh
Next Story