Sun Nov 17 2024 22:29:46 GMT+0000 (Coordinated Universal Time)
ఉబర్ పై సైబర్ దాడి.. ఉద్యోగి, వర్క్ స్పేస్ మెసేజింగ్ యాప్ లలోకి హ్యాకర్లు
గతవారమే ఉబర్ పై సైబర్ దాడి జరిగినట్లు వార్తలొచ్చాయి కానీ.. స్పష్టత లేదు. ఈసారి హ్యాకర్లు అంతర్గత సిస్టమ్ లను..
అమెరికాకు చెందిన ప్రముఖ సర్వీస్ ప్రొవైడర్ కంపెనీ.. ప్రపంచంలో అతిపెద్ద ఇంటర్నెట్ ట్యాక్సీ సర్వీస్ అయిన ఉబర్ సంస్థ హ్యాకింగ్ కు గురైంది. గత ఏడాది నుంచి చురుగ్గా ఉన్న 'లాప్సస్$' అనే హ్యాకింగ్ గ్రూప్ తమపై ఈ సైబర్ దాడికి పాల్పడిందని ఉబర్ వెల్లడించింది. ఉబర్ కు చెందిన ఓ ఉద్యోగి యాప్, వర్క్ స్పేస్ మెసేజింగ్ యాప్ లోకి హ్యాకర్లు చొరబడటంతో ఉబర్ డేటా ఉల్లంఘన అయినట్లు ఉబర్ ధృవీకరించింది. టెక్నాలజీలో ముందున్న కంపెనీలను హ్యాక్ చేసేందుకు లాప్సన్ ఈ పద్ధతులను పాటిస్తోందని.. ఈ ఏడాదిలోనే మైక్రోసాఫ్ట్, సిస్కో, శామ్సంగ్, ఎన్విడియా, ఓక్టా వంటి వాటిపై కూడా సైబర్ దాడి చేసిందని ఉబర్ పేర్కొంది.
కాగా. గతవారమే ఉబర్ పై సైబర్ దాడి జరిగినట్లు వార్తలొచ్చాయి కానీ.. స్పష్టత లేదు. ఈసారి హ్యాకర్లు అంతర్గత సిస్టమ్ లను యాక్సెస్ చేయడంతో హ్యాకింగ్ జరిగినట్లు సదరు సంస్థ గుర్తించింది. హ్యాకింగ్ లో వినియోగదారుల సమాచారం లీకవ్వలేదని..వినియోగదారుల ఖాతాలు, క్రెడిట్ కార్డ్ నంబర్లు, బ్యాంక్ ఖాతా సమాచారం, ట్రావెల్ హిస్టరీ వంటి సున్నితమైన సమాచారాన్ని నిల్వ చేయడానికి ఉపయోగించే డేటా బేస్‌లు సురక్షితంగా ఉన్నాయని తెలిపింది. వాటికి అదనపు రక్షణ కల్పిస్తామని ఉబర్ తెలిపింది.
Next Story