Mon Dec 23 2024 16:58:59 GMT+0000 (Coordinated Universal Time)
వారు మరో వ్యాపారవేత్తను కూడా హత్య చేయాలని ప్లాన్ చేశారట..!
మంగళవారం నాడు ఉదయ్‌పూర్‌లో టైలర్‌ను పట్టపగలు దారుణంగా నరికి చంపిన ఇద్దరు వ్యక్తులను రాజస్థాన్ పోలీసులు అరెస్టు చేశారు.
మంగళవారం నాడు ఉదయ్‌పూర్‌లో టైలర్‌ను పట్టపగలు దారుణంగా నరికి చంపిన ఇద్దరు వ్యక్తులను రాజస్థాన్ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వారిని ఉదయ్‌పూర్‌లోని సూరజ్‌పోల్ ప్రాంతానికి చెందిన గోస్ మహ్మద్, కుమారుడు రఫీక్ మహ్మద్, అబ్దుల్ జబ్బార్ కుమారుడు రియాజ్‌లుగా గుర్తించినట్లు లాథర్ తెలిపారు. బాధితుడిని రాజ్‌సమంద్ జిల్లాలోని భీమా పట్టణానికి చెందిన కన్హయ్యలాల్ తేలి (40)గా గుర్తించారు. అతను ఉదయపూర్‌లో టైలరింగ్ దుకాణం నడుపుతున్నాడు. ముందుజాగ్రత్త చర్యగా, పోలీసు సిబ్బంది అందరి సెలవులను రద్దు చేసినట్లు లాథర్ తెలిపారు. మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మకు మద్దతు ఇచ్చినందుకు ఉదయ్‌పూర్‌లోని రద్దీగా ఉండే వీధిలో మధ్యాహ్నం కన్హయ్యలాల్ ను అతడి దుకాణంలో తల నరికి చంపారు.
ఈ హత్యకు పాల్పడింది తామేనని నిందితులు చెబుతున్న ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పది రోజుల క్రితం, నూపుర్ శర్మకు అనుకూలంగా కన్హయ్యాలాల్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. అప్పటి నుంచి ఓ వర్గానికి చెందిన వ్యక్తులు అతడిని చంపేస్తామని బెదిరిస్తున్నారు. బెదిరింపులతో కలత చెందిన కన్హయ్యాలాల్ ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు ఆరు రోజులుగా తన దుకాణాన్ని కూడా తెరవలేదు.
కన్హయ్య లాల్ హత్య కేసులో ఇద్దరు నిందితులు ఉదయ్‌పూర్‌లో మరో వ్యాపారవేత్తను హతమార్చాలని ప్లాన్ చేశారని కూడా తెలుస్తోంది. నిషేధిత ఉగ్రవాద సంస్థ ఐఎస్‌తో సంబంధాలు ఉన్నాయని కూడా తెలుస్తోంది. అయితే మరో వ్యాపారవేత్త ఊరిలో లేకపోవడంతో ప్రాణాలు కాపాడుకోగలిగాడు. జూన్ 7న నూపుర్ శర్మకు మద్దతుగా తన కుమారుడు ఒక కంటెంట్‌ను పోస్ట్ చేశాడని వ్యాపారవేత్త తండ్రి మీడియాకు తెలిపారు. అతనిపై ఫిర్యాదు నమోదు చేయబడింది. ఒక రోజులో విడుదల చేశారు. జూన్ 9 నుండి, అతని దుకాణానికి ఎవరు పడితే ఆ వ్యక్తులు రావడం ప్రారంభించారు. ఇబ్బందిని గ్రహించిన వ్యాపారవేత్త తన దుకాణానికి రావడం మానేసి, నగరాన్ని కూడా విడిచిపెట్టాడు. అలా అతడు ప్రాణాలు కాపాడుకోగలిగాడు.
News Summary - Udaipur horror Killers had plans to murder another businessman
Next Story