Fri Nov 22 2024 22:48:52 GMT+0000 (Coordinated Universal Time)
ఏడాదిన్నరగా ఇంట్లోనే మృతదేహం.. సంచలన రేపిన ఘటన
యూపీలోని శివపురి గ్రామంలో విమలేశ్ అనే వ్యక్తి నివాసముండేవాడు. అతను అహ్మదాబాద్ లో ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో..
ఇంట్లో మనిషి చనిపోతే.. ఒకటి లేదా రెండ్రోజుల అనంతరం అంత్యక్రియలు చేస్తారు. దూర ప్రాంతాల నుంచి ముఖ్యమైన వారు రావాల్సి ఉంటే.. నాలుగైదు రోజుల వరకూ బాడీని ఫ్రీజర్ బాక్స్ లో పెడతారు. అనంతరం అంత్యక్రియలు నిర్వహిస్తారు. కానీ.. ఉత్తరప్రదేశ్ లోని ఓ ఫ్యామిలీ మాత్రం డెడ్ బాడీని ఏకంగా ఏడాదిన్నరగా ఇంట్లోనే ఉంచుకుంది. ఫలితంగా ఆ మృతదేహం కుళ్లిపోయి.. ఎముకల్లోని మజ్జ కూడా ఇంకిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
యూపీలోని శివపురి గ్రామంలో విమలేశ్ అనే వ్యక్తి నివాసముండేవాడు. అతను అహ్మదాబాద్ లో ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో విధులు నిర్వహించేవాడు. 2021 ఏప్రిల్ 22న విధుల్లోనే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు విమలేశ్ మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు కానీ అంత్యక్రియలు నిర్వహించలేదు. గ్రామస్తులకు విమలేశ్ మృతిచెందిన విషయం తెలియదు. విమలేశ్ కనిపించకపోవడంతో ఆరా తీయడం మొదలుపెట్టారు. విమలేశ్ అనారోగ్యంతో బాధపడుతున్నాడని, అతడు కోమాలో ఉన్నాడని డాక్టర్లు ట్రీట్ మెంట్ చేస్తున్నారని అందరినీ నమ్మించారు.
విమలేశ్భార్య మిథాలీ స్థానిక కో-ఆపరేటివ్ బ్యాంకులో మేనేజర్‌గా పని చేస్తోంది. పెన్షన్ కు అప్లై చేసుకునేందుకు విమలేశ్ మరణ ధ్రువీకరణ పత్రాన్ని బయటపెట్టడంతో అసలు విషయం తెలిసింది. వెంటనే అలర్ట్ అయిన ఆదాయ పన్నుశాఖ ఈ విషయాన్ని సీఎంవోకు తెలిపింది. వెంటనే మృతదేహాన్ని స్వాధీనం చేసుకోవాలని సీఎంఓ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. పోలీసులు విమలేశ్ ఇంటికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. డెడ్ బాడీని పరీక్షించిన వైద్యులు.. విమలేశ్మృతదేహం పూర్తిగా చెడిపోయిందని గుర్తించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది.
Next Story