Fri Dec 20 2024 16:17:42 GMT+0000 (Coordinated Universal Time)
ఇంట్లో ఖర్చులెంత ? ప్రశ్నించిన ఆ భర్త పరిస్థితి పాపం..
ఆ వ్యక్తి తన భార్యకు నెల నెలా డబ్బులు పంపుతూ ఉన్నాడు. అయితే ఖర్చులు ఎందుకు ఇంత చేస్తున్నారు అని అడిగాడు.
ఆ వ్యక్తి తన భార్యకు నెల నెలా డబ్బులు పంపుతూ ఉన్నాడు. అయితే ఖర్చులు ఎందుకు ఇంత చేస్తున్నారు అని అడిగాడు. అందుకు ఆ భార్య సమాధానం చెప్పకపోగా ఇష్టమొచ్చినట్లు బాదింది. దీంతో ఆ వ్యక్తి లబో దిబో అంటూ పెళ్ళాం బారి నుండి బయటపడ్డాడు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ దేహత్‌లో ఓ వ్యక్తిని భార్య, మరదలు కట్టేసి కర్రలతో కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాను పంపిన డబ్బును ఎలా ఖర్చు చేశారు, ఎందుకు ఖర్చు చేశారో చెప్పాలంటూ భార్యను ఆ వ్యక్తి అడగడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.
శివకుమార్ అనే వ్యక్తి బనారస్‌లో నివాసం ఉంటూ తన సోదరుడితో కలిసి కుల్ఫీ బండి నడుపుతున్నాడు. ప్రతి నెలా శివకుమార్ తన భార్య సుశీలకు ఖర్చుల కోసం డబ్బులు పంపేవాడు. బనారస్ నుండి ఇంటికి తిరిగి వచ్చిన శివకుమార్ తన భార్యను ఇంటి ఖర్చుల గురించి ప్రశ్నించాడు. ఎనిమిది క్వింటాళ్ల గోధుమలను కూడా విక్రయించారని.. తాను డబ్బు పంపిస్తూ ఉన్నప్పుడు గోధుమలను ఎందుకు అమ్మేశారని నిలదీశాడు. తాను పంపిన రూ.32 వేలకు లెక్క చెప్పమని అడిగాడు. దీంతో భార్య సుశీల తన సోదరితో కలిసి శివకుమార్ చేతులను కట్టేసి కర్రలతో కొట్టడం ప్రారంభించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భార్య దాడికి తెగబడింది శివకుమార్ ఫిర్యాదు చేశారని, భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 323, 504 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు. శివకుమార్ దెబ్బలు తింటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అతడే ఇంటికి డబ్బు పంపి.. అతడే దెబ్బలు తినడం చాలా మంది మగవాళ్ళను బాధపెట్టింది. ఖర్చుల లెక్కలు కూడా అడగడం తప్పేనా అంటూ వాపోతున్నారు.
Next Story