Sun Dec 22 2024 16:28:04 GMT+0000 (Coordinated Universal Time)
స్టేషన్ లో కనిపించిన బల్లి.. మింగేసిన ఖైదీ
బాలికపై అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్నాడు మహేశ్ అనే యువకుడు. పోలీసులు అతడిని ఇటీవలే కోర్టులో హాజరుపరిచారు.
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఓ విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. బాలికపై అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న యువకుడు జైలుకు వెళ్లాల్సి వస్తుందనే భయంతో ఏకంగా బల్లిని మింగేశాడు. అతడు పోలీస్స్టేషన్లో ఉండగానే బల్లిని మింగేయడంతో పోలీసులు అతడిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నిందితుడి పరిస్థితి నిలకడగా ఉన్నట్టు తెలిపారు.
బాలికపై అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్నాడు మహేశ్ అనే యువకుడు. పోలీసులు అతడిని ఇటీవలే కోర్టులో హాజరుపరిచారు. త్వరలో జైలుకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో అతడు పోలీస్ స్టేషన్లో ఉండగా ఉండగా.. నన్ను జైలుకు పంపించేస్తారని భయపడ్డాడు. ఏమి చేయాలా అని అతడు అనుకుంటూ ఉండగా.. స్టేషన్ లో ఓ బల్లి కనిపించింది.. వెంటనే లటుక్కున ఆ బల్లిని మింగేశాడు. ఆ విషయం పోలీసులకు తెలియడంతో అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. నిందితుడి ఆరోగ్య పరిస్థితి బాగా ఉందని పోలీసులు తెలిపారు. మహేశ్ సాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిషన్ పూర్ గ్రామానికి చెందినవాడు. 24 ఏళ్ల అతను జూన్ 14న 18 ఏళ్ల బాలికను అపహరించి అత్చాచారం చేశాడనే ఆరోపణలతో పోలీసులు అరెస్ట్ చేశారు.
Next Story