Mon Dec 23 2024 13:54:17 GMT+0000 (Coordinated Universal Time)
యూపీలో దారుణం.. యువతిపై అత్యాచారం.. ఆపై విక్రయం
యువతిని రహస్య ప్రాంతంలో ఉంచి.. పలుమార్లు సామూహిక అత్యాచారం చేశారు. కొద్దిరోజుల తర్వాత యువతిని..
ఝాన్సీ : మహిళలు, యువతులపై జరిగే దారుణాలకు నెలవైన యూపీలో మరో దారుణం వెలుగుచూసింది. పెళ్లి శుభలేఖలు పంచేందుకు వెళ్లిన 18 ఏళ్ల యువతిని ముగ్గురు యువకులు కిడ్నాప్ చేసి.. సామూహిక అత్యాచారం చేసి, ఆపై రాజకీయ నేతకు అప్పగించిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఝాన్సీ జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెపిన వివరాల మేరకు.. బాధిత యువతికి ఏప్రిల్ 21న వివాహం జరగాల్సి ఉంది. పెళ్లికి సన్నిహితులను ఆహ్వానించేందుకు శుభలేఖలు తీసుకుని 18న యువతి బయటికి వెళ్లింది. ఆ సమయంలో ముగ్గురు యువకులు ఆమెను కిడ్నాప్ చేశారు.
యువతిని రహస్య ప్రాంతంలో ఉంచి.. పలుమార్లు సామూహిక అత్యాచారం చేశారు. కొద్దిరోజుల తర్వాత యువతిని ఓ రాజకీయపార్టీకి చెందిన వ్యక్తికి అప్పగించారు. అతను కూడా యువతిని కొన్నిరోజులు తనవద్ద ఉంచుకుని.. ఆ తర్వాత మధ్యప్రదేశ్లోని దాటియా జిల్లా పఠారి గ్రామంలోని మరో వ్యక్తి వద్దకు పంపించాడు. పఠారిలో ఎలాగొలా ఒక ఫోన్ సంపాదించిన యువతి.. తనకు జరిగిందంతా తండ్రికి ఫోన్ చేసి చెప్పింది. తండ్రి పోలీసులకు విషయం చెప్పగా.. పోలీసులు పఠారి గ్రామంలో యువతి ఉన్న ప్రదేశానికి వెళ్లి.. ఆమెను కామాంధుల చెర నుంచి రక్షించారు. తనను కిడ్నాప్ చేసి, అత్యాచారం చేసి ఆపై విక్రయించినట్లు బాధిత యువతి ఫిర్యాదులో తెలుపగా.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెహరౌలి సర్కిల్ ఆఫీసర్ వెల్లడించారు.
Next Story