Sun Dec 22 2024 21:37:39 GMT+0000 (Coordinated Universal Time)
తన ఆరోగ్యం కోసం.. నాలుగునెలల కొడుకుని చంపిన తల్లి
ఉత్తరప్రదేశ్ లోని సుల్తాన్ పూర్ జిల్లా ధనుదీ గ్రామానికి చెందిన మంజూ అనే మహిళ..
టెక్నాలజీ యుగం.. కంప్యూటర్ యుగమంటూ.. ఓ పక్క అభివృద్ధి దిశగా పరుగులు పెడుతుంటే.. మరోవైపు ఇప్పటికీ మూఢ నమ్మకాలతో చేయరాని పనులు చేస్తున్నారు కొందరు. ఆ మూఢనమ్మకాలతో కన్నబిడ్డల ప్రాణాలను తీసేందుకు సైతం వెనుకాడట్లేదు. స్వార్థం, మూఢ నమ్మకాలు, చేతబడులతో తమ జీవితాలను తామే చేజేతులా నాశనం చేసుకుంటూ.. బిడ్డల జీవితాలను ఆగం చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి యూపీలో వెలుగుచూసింది. 35 ఏళ్ల మహిళ మూఢనమ్మకంతో తన నాలుగు నెలల కొడుకుని చంపుకుంది.
ఉత్తరప్రదేశ్ లోని సుల్తాన్ పూర్ జిల్లా ధనుదీ గ్రామానికి చెందిన మంజూ అనే మహిళ.. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఆమె భర్త కాన్పూర్ లో కూలీ పనులు చేస్తుంటాడు. మూఢ నమ్మకంతో తన కొడుకుని హతమార్చింది. నాలుగు నెలల పసిగుడ్డు అని కూడా చూడకుండా పారతో కొట్టి అత్యంత దారుణంగా చంపేసింది. ఆ సమయంలో ఆమెకు కన్న మమకారం కూడా గుర్తు రాకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు మంజూని అరెస్ట్ చేసి, విచారణ చేస్తున్నారు.
Next Story