Sun Dec 22 2024 21:05:43 GMT+0000 (Coordinated Universal Time)
గొడ్డలితో దాడి.. నూతన వధూవరులు సహా ఐదుగురి మృతి
నిద్రలో ఉన్న వారందరినీ నరికి చంపాడు. వారంతా అక్కడికక్కడే మరణించారు. అనంతరం శివవీర్ తన భార్య డాలీ, మేనత్తపై కూడా దాడి
దేశంలో జరుగుతున్న దారుణాలు చూస్తుంటే.. మళ్లీ క్రైం రేటు పెరిగిపోతుందన్న అనుమానం రాకపోదు. తాజాగా ఓ వ్యక్తి నిద్రిస్తున్న వారిపై గొడ్డలితో దాడి చేసి.. అతికిరాతకంగా చంపాడు. ఆపై తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దాడిలో నూతన వధూవరులు సహా ఐదుగురు మృతి చెందారు. ఈ దారుణ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని మైన్ పురి జిల్లా గోకుల్ పుర్ లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. శనివారం వేకువజామున గోకుల్ పుర్ కు చెందిన శివవీర్ యాదవ్ (30), సోదరులు భుల్లన్ యాదవ్(25), సోనూ యాదవ్(21), సోనూ భార్య సోనీ (20), బావ సౌరభ్(23), స్నేహితుడు దీపక్(20) లపై గొడ్డలితో దాడి చేశాడు.
నిద్రలో ఉన్న వారందరినీ నరికి చంపాడు. వారంతా అక్కడికక్కడే మరణించారు. అనంతరం శివవీర్ తన భార్య డాలీ, మేనత్తపై కూడా దాడి చేసి, తనను తాను తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి వెళ్లి.. తీవ్రగాయాల పాలైన శివవీర్ మేనత్త, భార్య డాలీ లను ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను మార్చురీకి తరలించారు. మృతుల్లో ఉన్న సోనూ యాదవ్ - సోనీ లకు ఘటనకు 24 గంటలకు ముందే వివాహం జరిగినట్లు పోలీసులు తెలిపారు. కాగా.. శివవీర్ శుక్రవారమే ఇటావా నుంచి గోకుల్ పుర్ కు వచ్చాడని చెబుతున్నారు. హత్యలకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Next Story