Mon Dec 23 2024 16:51:40 GMT+0000 (Coordinated Universal Time)
వీళ్లకేం పోయేకాలం.. ఈసారి ఏకంగా చెవిలోనే మూత్రం పోశాడు
సోన్ భద్ర జిల్లాలో ఓ వ్యక్తి గిరిజనుడి చెవిలో మూత్ర విసర్జన చేసినట్లు చూపించే వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం..
ఇటీవల కాలంలో మధ్యప్రదేశ్ లో ఆదివాసీపై ప్రవేశ్ శుక్లా అనే వ్యక్తి మూత్ర విసర్జన చేసిన వీడియో.. ఏ స్థాయిలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిందో తెలిసిందే. ఆ తర్వాత ఆ వ్యక్తిని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఇంటికి పిలిపించి, కాళ్లు కడిగి క్షమాపణలు కోరిన వీడియో సైతం వైరల్ అయింది. ఆ తర్వాతే అసలు ట్విస్ట్ బయటపడింది. అసలు బాధితుడిని నేను కాదంటూ.. సీఎంతో కాళ్లు కడిగించుకున్న వ్యక్తి చెప్పడం కొసమెరుపు. మరి అసలు బాధితుడెవరన్నదానిపై ఇంతవరకూ క్లారిటీ లేదు. మరోవైపు ప్రవేశ్ శుక్లా రేవా జైలులో రిమాండ్ ఖైదీ గా ఉన్నాడు. ఇదిలా ఉండగా.. తాజాగా అలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్ లోనూ చోటుచేసుకుంది.
సోన్ భద్ర జిల్లాలో ఓ వ్యక్తి గిరిజనుడి చెవిలో మూత్ర విసర్జన చేసినట్లు చూపించే వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో పోలీసులు ఒకరిని అరెస్ట్ చేశారు. కాగా.. ఘటన జరిగిన సమయంలో బాధితుడు మద్యంమత్తులో ఉండటంతో ఈ విషయాన్ని గుర్తించలేదు. ఆ తర్వాత వైరల్ అయిన వీడియో చూసి తన జరిగిన అవమానాన్ని తెలుసుకుని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. జులై 11న జరిగిన ఈ ఘటన నాలుగు రోజులు ఆలస్యంగా వెలుగు చూసింది.
జిల్లాలోని జుగైల్ ప్రాంతానికి చెందిన జవహర్ పటేల్, గులాబ్ కోర్ లకు ముందే పరిచయం ఉంది. ఇద్దరూ కలిసి జులై 11న మద్యం సేవించారు. మద్యం మత్తులో ఇద్దరి మధ్యన చిన్న విషయంపై వాగ్వాదం జరిగింది. దాంతో జవహర్ పటేల్.. గులాబ్ చెవిలో మూత్ర విసర్జన చేశాడు. అప్పటికే అతను మద్యంమత్తులో ఉండటంతో ఈ విషయాన్ని గ్రహించలేదు ఆ వీడియో నెట్టింట వైరల్ కావడంతో.. మరుసటి రోజున తనకు జరిగిన అవమానంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి, జవహర్ పటేల్ ను అరెస్ట్ చేశారు.
Next Story