Fri Apr 04 2025 09:51:34 GMT+0000 (Coordinated Universal Time)
వనమా రాఘవ అరెస్ట్... ఏపీ సరిహద్దుల్లో?
కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భద్రాద్రి జిల్లాలోని దమ్మపేట మండలం మందలపల్లి వద్ద రాఘవను పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. తమకు లొంగిపోవాలంటూ పోలీసులు నిన్ననే రాఘవ ఇంటికి పోలీసులు నోటీసులు అంటించిన సంగతి తెలిసిందే.
నోటీసులు.....
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న కేసులో రాఘవ నిందితుడు. రామకృష్ణ సూసైడ్ చేసుకునే ముందు సెల్ఫీ వీడియోలోనూ రాఘవపై పలు ఆరోపణలు చేశారు. దీంతో రాఘవ కోసం పోలీసులు వెదుకుతున్నారు. విపక్షాలు సయితం రాఘవను అరెస్ట్ చేయాలంటూ నిన్న జిల్లాలో బంద్ ను పాటించాయి.
Next Story