Mon Dec 23 2024 15:42:13 GMT+0000 (Coordinated Universal Time)
వెరైటీ దొంగ.. డబ్బు, నగలు అస్సలు ముట్టుకోలేదు ! మరి ఏం దోచుకెళ్లాడు ?
10 రోజుల పాటు అక్కడే ఉన్నారు. కొద్దిరోజులుగా ఇంటికి తాళం వేసి ఉండటాన్ని గమనించిన దొంగ శుక్రవారం రాత్రి ఆ ఇంటి తాళాన్ని..
సాధారణంగా దొంగల ప్రధాన లక్ష్యం డబ్బు, నగలు దోచుకెళ్లడం. ఇళ్లల్లో చొరబడే దొంగలు వీటికోసమే వెతుకుతారు. కొందరు వాహనాల చోరులు కూడా ఉంటారు. కానీ ఈ దొంగ మాత్రం కాస్త వెరైటీ దొంగనే చెప్పాలి. ఇంట్లో ఉన్న డబ్బు, నగలను అస్సలు ముట్టుకోడు. మరి ఇంకేం దోచుకెళ్తాడు అనుకుంటున్నారా ? మీరే చదవండి. వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణలోని తాండూరు పట్టణం కొడంగల్ కు చెందిన మోనాచారి.. తన బంధువులు ఆస్పత్రిలో ఉంటే చూసేందుకు భార్యా పిల్లలతో కలిసి పరిగి వెళ్లారు.
Also Read : కరోనా పరీక్షలపై అలసత్వం.. డబ్ల్యూహెచ్ఓ ఆందోళన
10 రోజుల పాటు అక్కడే ఉన్నారు. కొద్దిరోజులుగా ఇంటికి తాళం వేసి ఉండటాన్ని గమనించిన దొంగ శుక్రవారం రాత్రి ఆ ఇంటి తాళాన్ని పగులగొట్టి లోపలికి వెళ్లాడు. బీరువా తీసి చూస్తే.. 6 తులాల బంగారం, 30 తులాల వెండి ఆభరణాలు, కొంతమొత్తంలో నగదు, దుస్తులు ఉన్నాయి. కానీ ఆ దొంగ నగలు, నగదును అస్సలు ముట్టుకోలేదు. మోనాచారి ఇటీవల తన కుమారుడికి పెళ్లి చేయడంతో ఇంట్లో కొత్త దుస్తులు ఎక్కువగా ఉన్నాయి. దాంతో కొత్త ప్యాంట్లు, షర్టులు, చీరలు, ఇతర దుస్తులను మూట గట్టుకుని తీసుకెళ్లాడు.
Also Read : జగ్గారెడ్డిపై సోనియా సీరియస్
ఇంటికి తిరిగివచ్చిన తర్వాత.. ఇంటి యజమానురాలైన హైమావతి .. ఇంట్లో దొంగతనం జరిగిందని గమనించింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా..వారు ఇంటికి వచ్చి తనిఖీ చేశారు. బంగారం, వెండి, నగదు భద్రంగానే ఉండడంతో ఊపిరి పీల్చుకున్నారు. కానీ.. తమ దుస్తులు మాత్రమే దొంగిలించడం ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story