Mon Dec 23 2024 12:18:38 GMT+0000 (Coordinated Universal Time)
హైదరాబాద్ లో కస్టమర్లను వెయిటర్లు బాదేశారు
అబిడ్స్ పోస్టాఫీస్ వెనుక ఉన్న గ్రాండ్ హోటల్ వెయిటర్లు కర్రలతో కస్టమర్ల పై
అబిడ్స్ పోస్టాఫీస్ వెనుక ఉన్న గ్రాండ్ హోటల్ వెయిటర్లు కర్రలతో కస్టమర్ల పై దాడి చేశారు. విషయం తెలుసుకున్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వెంటనే స్పందించి ఇన్స్పెక్టర్ అబిడ్స్తో మాట్లాడి గ్రాండ్ హోటల్ వెయిటర్లు, యజమానిపై తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేయాలని కోరారు. లేనిపక్షంలో హోటల్కు నిప్పు పెడతామని హెచ్చరించారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అబిడ్స్ పోలీసు ఇన్స్పెక్టర్తో మాట్లాడి రెస్టారెంట్ వెయిటర్లు, యజమానులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
మూలాల ప్రకారం, ఎనిమిది మంది ఆహారం తిని డబ్బులు చెల్లించడానికి నిరాకరించడంతో ఈ సంఘటన జరిగింది. ఐపీసీ సెక్షన్లు 324, 504, 509 కింద రెస్టారెంట్పై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. రెస్టారెంట్ యాజమాన్యం కూడా ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story