Fri Nov 22 2024 12:39:13 GMT+0000 (Coordinated Universal Time)
CyberCrime: డబ్బులు రెట్టింపు చేస్తామంటూ గృహిణికి మెసేజీ.. లక్షకు పైగా అందులో పెట్టి చివరికి!!
సైబర్ నేరగాళ్ల కారణంగా ఒక లక్షా 30వేల రూపాయలు పోగొట్టుకున్న 28 ఏళ్ల మహిళ
సైబర్ నేరగాళ్ల కారణంగా ఒక లక్షా 30వేల రూపాయలు పోగొట్టుకున్న 28 ఏళ్ల మహిళ ఆత్మహత్య చేసుకుంది. కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం మంటాడ గ్రామానికి చెందిన పి.స్రవంతి(28)కి గత నెల 12న టెలిగ్రామ్ యాప్ ద్వారా కాంటాక్ట్ అయ్యారు. పెట్టిన పెట్టుబడికి తక్కువ సమయంలోనే రెట్టింపు డబ్బు ఇస్తామని హామీ ఇచ్చారు.
స్రవంతి అప్పుడు ఒక లింక్ని క్లిక్ చేయమని అడిగారు. ఆమె క్లిక్ చేసి 200, 400 రూపాయలు వంటి చిన్న మొత్తాలను పెట్టుబడి పెట్టింది. అందులో ఆమెకు లాభం చూపించారు. సైబర్ మోసగాళ్లు ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టమని బాధితురాలికి ఎర వేశారు. జూలై 19, 20, 21 తేదీల్లో 11 లావాదేవీల్లో సైబర్ మోసగాళ్ల బ్యాంకు ఖాతాలకు 1.30 లక్షల రూపాయలను స్రవంతి పంపించింది. ఈ డబ్బును ఆమె తన ఇరుగుపొరుగు వారి నుంచి అప్పుగా తీసుకుని బదిలీ చేసింది.
బాధితురాలు తనకు రావాల్సిన లాభాలు, పెట్టుబడి మొత్తాన్ని తిరిగి ఇవ్వమని అడిగింది. అయితే వారు మరింత డబ్బు పంపించాలని ఆమెను డిమాండ్ చేశారు. దీంతో స్రవంతి తాను మోసపోయానని గ్రహించి తన జీవితాన్ని ముగించుకుంది. తనను క్షమించమని.. ఇద్దరు పిల్లలను బాగా చూసుకోవాలని కోరుతూ భర్తకు ఓ మెసేజీ పంపించింది. స్రవంతిని భర్త విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. పమిడిముక్కల పోలీసులు ఐపిసి సెక్షన్ 420, ఐటి చట్టంలోని సెక్షన్ 66 (డి), బిఎన్ఎస్ చట్టంలోని సెక్షన్ 108, 318 క్లాజ్ (4) కింద కేసు నమోదు చేశారు.
Next Story