Mon Dec 23 2024 05:00:01 GMT+0000 (Coordinated Universal Time)
Son and Mother : వీడు కొడుకు కాడు.. కిరాతకుడు.. తల్లినే స్థంభానికి కట్టేసి?
కన్నతల్లిని స్థంభానికి కట్టేసి మరీ కొట్టిన ఒక కొడుకును చూసిన ఆ గ్రామం నివ్వెర పోయింది.
తల్లి అంటే దైవంతో సమానం. కన్నతల్లి పంచిన ప్రేమను వృద్ధాప్యంలో ఆమెకు రుచిచూపించాల్సిన కొడుకులే కాలయముడిలా మారుతున్నారు. కుటుంబ బాంధవ్యాలను మరిచిపోయి ప్రవర్తించడం మామూలుగా మారిపోయింది. తల్లి లేదు.. కన్న తల్లి అన్న ధ్యాస లేదు.. ఎంతసేపూ సంపాదనపైనే ధ్యాస. అటువంటి అమానవీయ ఘటన ఒకటి ఒడిశాలో చోటు చేసుకుంది. కన్నతల్లిని స్థంభానికి కట్టేసి మరీ కొట్టిన ఒక కొడుకును చూసిన ఆ గ్రామం నివ్వెర పోయింది. చివరకు ఆ కిరాతకుడిపై పోలీసు కేసు నమోదయింది.
తల్లిని స్థంభానికి కట్టేసి...
ఒడిశాలోని కియోంఝర్లోని నరపసి గ్రామంలో శతృఘ్న మహంత తన తల్లిని పెట్టిన హింసలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇంతకూ ఆ కన్నతల్లి చేసిన తప్పేమిటంటే.. పొలంలో పండిన ఒక కాలిఫ్లవర్ ను కోసుకోవడమే. తన కుమారుడికి చెందిన పొలంలో పండిన కాలిఫ్లవర్ ను కోసుకుని ఆ తల్లి కూర వండి పెట్టాలనుకుంది. అదే ఆ కిరాతకుడి ఆగ్రహానికి కారణమయింది. తనను అడగకుండా కాలిఫ్లవర్ ను కోసుకున్నందుకు కన్నతల్లిని స్థంభానికి హంతి కట్టేశాడు.
గొడ్డును బాదినట్లు బాది...
కన్నతల్లి అనే కనికరం లేకుండా గొడ్డును బాదినట్లు బాదాడు. అంతడితో ఆగలేదు. ఎందుకు కాలిఫ్లవర్ కోశావంటూ అనరాని మాటలు అంటూ ఆమె మనసును క్షోభపెట్టాడు. ఆ తల్లికి ఇద్దరు కొడుకులున్నారు. అందులో శతృఘ్న మహంత ఒకడు. ఇద్దరికీ పెళ్లిళ్లయ్యాయి. వేర్వేరుగా ఉంటూ వ్యవసాయం చేసుకుంటున్నారు. చిన్న కొడుకైన శతృఘ్న కాలిఫ్లవర్ పంటను సాగు చేస్తుండగా.. తన కొడుకు పొలమే కదా అని ఆ తల్లి ధైర్యంగా వెళ్లి కాలిఫ్లవర్ ను కోసింది. దొంగతనం చేయలేదు. తన కొడుకు ఏమీ అనడులే అన్న ధీమాతోనే ఆ పని చేసింది. అయితే అది చూసినా వాడు తల్లిని స్థంభానికి కట్టేసి చితకబాదాడు. ఇది చూసిన గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు అతగాడిపై కేసు నమోదు చేశారు.
Next Story