Mon Dec 15 2025 04:14:09 GMT+0000 (Coordinated Universal Time)
Vizag Gajuvaka: విశాఖలో దారుణం.. గాజువాక జగ్గు జంక్షన్ లో దారుణ హత్య
విశాఖలో దారుణ హత్య జరిగింది. గాజువాక జగ్గు జంక్షన్ సమీపంలోని

విశాఖలో దారుణ హత్య జరిగింది. గాజువాక జగ్గు జంక్షన్ సమీపంలోని శ్రీకృష్ణ నగర్ వద్ద వికలాంగుడు అయిన మాజీ సైనికుడు దారుణ హత్యకు గురయ్యాడు. మృతి చెందిన వ్యక్తి మాజీ సైనికుడు వేమిరెడ్డి అప్పలనాయుడు (46) గా గుర్తించారు. స్థల వివాదంలో తరచూ గొడవలు జరుగుతుందడంతో ఈ హత్య జరిగింది. అతి దారుణంగా కత్తులతో నరికి చంపేశారు.
అప్పలనాయుడు ఆర్మీలో పని చేశాడు. తరువాత అనారోగ్య కారణాలతో కాళ్లు చచ్చుబడ్డాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. చినగంట్యాడలో ఒక స్థలం విషయంలో అప్పలనాయుడుకి స్థానికులు బంకా రాము, అతని అన్న కుమారుడు బంక అశోక్లతో 2016 నుంచి గొడవలు ఉన్నాయి. అప్పలనాయుడును ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని పథకం వేశారు. తన వాహనంపై వస్తున్న అప్పలనాయుడుపై రాము, అశోక్ ఒక్కసారిగా దాడికి దిగి కత్తితో మెడ, చేతులను దారుణంగా నరికేశారు. రక్తపు మడుగులో అక్కడికక్కడే అప్పలనాయుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా స్థానిక ప్రజలు షాక్ అయ్యారు. అప్పలనాయుడు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ మార్చురీ కి తరలించారు. కేసు నమోదు చేసి గాజువాక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్య చేసిన అనంతరం నిందితులు పోలీసులకు లొంగిపోయారు.
Next Story

