Mon Dec 23 2024 01:30:57 GMT+0000 (Coordinated Universal Time)
విశాఖలో కారును ఢీకొన్న ట్రైన్.. మిరకిల్ ఏమిటంటే?
విశాఖలో ట్రైన్ ను కారు ఢీకొట్టింది. షీలా నగర్ పోర్ట్ రోడ్డులో జరిగిన ఈ ప్రమాదంలో
విశాఖలో ట్రైన్ ను కారు ఢీకొట్టింది. షీలా నగర్ పోర్ట్ రోడ్డులో జరిగిన ఈ ప్రమాదంలో ఓ కారు తుక్కు తుక్కయ్యింది. సుజుకి బెలునో కారును గూడ్స్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్నవారికి ఎవరికీ ఎలాంటి గాయాలు అవ్వకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ ప్రమాదాన్ని చూసినవారు మాత్రం భయంతో వణికిపోయారు. లూప్ లైన్‌ను క్రాస్ చేసే సమయంలో ట్రాక్ మధ్యలో కారు ఒక్కసారిగా ఆగిపోయింది. ఇది గమనించిన లోకో పైలట్ రైలును స్లో చేశాడు. అయితే ట్రైన్ దగ్గరకు వస్తుండడాన్ని గమనించి వెంటనే కారు డోర్లు తెరచి బయటకు దూకేశారు. అయితే ట్రైన్ మాత్రం కారును ఢీకొట్టింది. ఈ సినిమాటిక్ యాక్సిడెంట్ లో స్వల్ప గాయాలతో ప్రయాణికులు ప్రాణాలతో భయట పడ్డారు. అయితే కారు మాత్రం నుజ్జు నుజ్జు అయింది. ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాకపోవడం.. అతి స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
విశాఖ లోని షీలా నగర్ పోర్ట్ రోడ్డు మారుతి సర్కిల్ వద్ద ఈ తెల్లవారుజామున ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆ కారులో ప్రయాణిస్తున్న నలుగురు కుటుంబ సభ్యులు ప్రాణాలతో భయటపడ్డారు. పోర్ట్ నుంచి స్థానిక వేర్ హౌజ్‌లకు వెళ్ళే రైల్వే లూప్ లైన్ పై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కారుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఎవరికీ ఏమీ అవ్వకపోవడం నిజంగా అదృష్టం అంటూ పోస్టులు పెడుతున్నారు.
Next Story