Sun Dec 22 2024 23:53:15 GMT+0000 (Coordinated Universal Time)
విశాఖ బీచ్ రోడ్డులో ముగ్గురు మృతి
విశాఖపట్నం బీచ్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మద్యం మత్తులో
విశాఖపట్నం బీచ్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మద్యం మత్తులో అతివేగంగా కారు డ్రైవ్ చేయడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వేగంగా వచ్చిన కారు అదుపు తప్పి ఎదురుగా బైక్ పై వస్తున్న వారిని ఢీకొట్టింది. దీంతో వారు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి కూడా మృతి చెందాడు. సోమవారం రాత్రి 10గంటల సమయంలో విశాఖపట్టణంలోని బీచ్ రోడ్డులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మృతిచెందిన వారిలో భార్యభర్తలు ఉన్నారు. సింగారపు పృథ్వీరాజ్ (28), ప్రియాంక (21) చనిపోయారు.
కారులో ఉన్న వాళ్లలో చనిపోయిన వ్యక్తిని మణికుమార్(25)గా గుర్తించారు. ఈ ఘటన సమయంలో కారులో ఆరుగురు యువకులు ఉన్నట్లు తెలిసింది. వారిలో ముగ్గురు ఘటన స్థలం నుంచి పరారవ్వగా.. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. ప్రమాదానికి గురైన కారులో పోలీసులు మద్యం సీసాలను గుర్తించారు.
బీచ్ రోడ్డులో ప్రమాదాల నివారణకు అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా ఇలాంటి ఘటనల కారణంగా జనం ప్రభావితమవుతూ ఉన్నారు. ఉమర్ ఆలీషా ఆశ్రమం సమీపంలో ఉన్న మలుపు వద్ద స్టాపర్ల ఏర్పాటు చేశారు. వాహనాలు అతివేగంగా వచ్చినప్పుడు ఈ మలుపు వద్ద స్టీరింగ్లు ఎడమ చేతి వైపు తిరగకుండా కుడి చేతి వైపు వెళ్లి డివైడర్ను ఢీకొనడం, ఆపై సెంట్రల్ లైటింగ్ పోల్స్ను ఢీకొనడం జరుగుతుంది. ఈ మేరకు ఇక్కడ ఐదు స్టాపర్ బోర్డులు ఏర్పాటు చేశారు.
Next Story