Mon Dec 23 2024 01:11:22 GMT+0000 (Coordinated Universal Time)
కానిస్టేబుల్ రమేష్ ను కడతేర్చింది వేరెవరో కాదు
విశాఖపట్నంలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న రమేష్ అడ్డుతొలగించాలని అనుకుంది. శివాని తన భర్తను
అనే వ్యక్తి వ్యక్తి హత్య మిస్టరీ వీడింది. పెళ్ళామే ఊహించని దారుణానికి ఒడిగట్టింది. రమేష్ కు కొన్నాళ్ల క్రితం శివానితో పెళ్లయ్యింది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. శివారి రామారావు అనే వ్యక్తితో శివాని వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలిసిన రమేష్.. భార్యని మందలించాడు. అయినా ఆమెలో మార్పు రాలేదు. కుంగిపోయిన రమేష్ మద్యానికి బానిస అయ్యాడు. ఏం చేయాలో తెలియక లోలోపలే కుమిలిపోతూ ఉండేవాడు.
ఇక శివాని కూడా భర్తను అడ్డుతొలగించాలని అనుకుంది. శివాని తన భర్తను చంపి, ప్రియుడితో కలిసుండాలని అనుకుంది. భర్తని చంపి వరకట్న సమయంలో రమేష్‌కి ఇచ్చిన అర ఎకరం అమ్మేసి, ప్రియుడితో కలిసి జీవించాలని అనుకుంది. నీలా అనే వ్యక్తికి రూ.2 లక్షల సుపారీ ఇచ్చారు. రమేష్‌ను చంపేందుకు శివాని, రామారావు కలిసి ప్లాన్ వేశారు. శివాని తన భర్తకు మత్తు ట్యాబ్లెట్స్ ఇచ్చింది. అవి వేసుకున్న తర్వాత రమేష్ గాఢ నిద్రలోకి జారిపోయాడు. ప్రియుడు, నీలా కలిసి తలదిండు మొహానికి అడ్డుపెట్టి చంపేశారు. భర్తను చంపే సమయంలో శివాని తన ఫోన్లో వీడియో తీసింది. అనంతరం తనకేమీ తెలియదన్నట్టు డ్రామా ఆడింది. కాల్‌డేటా, వాట్సాప్ చాట్ ఆధారంగా లోతైన దర్యాప్తు చేయగా, భార్యే హంతకురాలని పోలీసులు తేల్చారు. భర్తని చంపినట్టు శివాని ఒప్పుకుంది.
Next Story