Thu Dec 19 2024 16:10:01 GMT+0000 (Coordinated Universal Time)
సెల్ఫీ వీడియోతో అదృశ్యమైన దంపతులు మృతి
వర ప్రసాద్ విశాఖ స్టీల్ ప్లాంట్ లో మాస్టర్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నారు. పొదుపు చేసిన డబ్బులతో కూర్మన్నపాలెంలో బ్యాటరీ
ఈనెల 27న సెల్ఫీవీడియో తీసుకుని, వెళ్లిపోతున్నాం.. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండని చెప్పి అదృశ్యమైన దంపతుల మృతదేహాలు లభ్యమయ్యాయి. విశాఖపట్నం వడ్లపూడి తిరుమలనగర్ సమీపంలోని శివాజీ నగర్ కు చెందిన చిత్రాడ వరప్రసాద్ (47), మీరా (41) దంపతులకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమార్తెకు 2021లో వివాహం చేశారు. వర ప్రసాద్ విశాఖ స్టీల్ ప్లాంట్ లో మాస్టర్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నారు. పొదుపు చేసిన డబ్బులతో కూర్మన్నపాలెంలో బ్యాటరీ వ్యాపారం పెట్టగా.. దానిని కొడుకు చూసుకుంటున్నాడు.
మూడేళ్ల క్రితం వచ్చిన కరోనా.. చావుదెబ్బ కొట్టింది. అందరికీ పాజిటివ్ వచ్చింది. దాంతో వైద్యానికి అప్పులు చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత కూడా వ్యాపారం నిమిత్తం, ఇతర అవసరాలకు అధిక వడ్డీలకు మరిన్న అప్పులు చేశాడు వరప్రసాద్. వాటిని ఎలా తీర్చాలో తెలియక కొద్దిరోజులుగా మనోవేదనకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే ఆత్మహత్యే శరణ్యంగా భావించారు. మార్చి 27న మేము ఆత్మహత్య చేసుకుంటున్నాం అని సెల్ఫీ వీడియో తీసి.. ఆ ఫోన్ ను ఇంట్లోనే వదిలేసి వెళ్లిపోయారు. ఈ విషయం వరప్రసాద్ కొడుకు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
అదృశ్యమైన వరప్రసాద్, మీరా ల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా.. ఏలేరు కాలువ వద్ద వారికి సంబంధించిన వస్తువులు కనిపించాయి. అప్పటి నుంచి వారికోసం కాలువలో వెతికించగా.. బుధవారం ఉదయం రాజుపాలెం వద్ద కాలువలో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. కరోనా దెబ్బకు వ్యాపారం నెమ్మదించడంతో.. చేసిన అప్పులు తీర్చే దారి తెలియక ఆ దంపతులు బలవన్మరణం చెందారు.
Next Story