Mon Dec 23 2024 04:11:18 GMT+0000 (Coordinated Universal Time)
విశాఖలో మైనర్ పై ప్యూన్ లైంగిక దాడి
విశాఖలో దారుణం జరిగింది. బాలిక చదువుతున్న పాఠశాలలోనే అటెండర్‌గా పనిచేస్తున్న వ్యక్తి నగ్న వీడియోలతో
విశాఖలో దారుణం జరిగింది. బాలిక చదువుతున్న పాఠశాలలోనే అటెండర్‌గా పనిచేస్తున్న వ్యక్తి నగ్న వీడియోలతో కొంతకాలంగా బాలికను బెదిరిస్తూ అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఆ వీడియోలను స్నేహితులకూ పంపడంతో వారు కూడా బాలికను బెదిరించి లైంగిక దాడికి తెగబడ్డారని ప్రచారం సాగుతోంది. ఆ బాలిక నేవీ అధికారి కుమార్తె.
నగరంలోని ఓ అపార్టుమెంట్లో నేవీ ఉద్యోగి.. భార్య, 14 ఏళ్ల కుమార్తెతో నివాసం ఉంటున్నారు. ఆమె ఇంటికి సమీపంలో బాలిక చదువుతున్న స్కూల్లో ప్యూన్‌గా పనిచేస్తున్న సత్యారావు నివాసం ఉంటున్నాడు. బాలికకు మాయమాటలు చెప్పి సత్యారావు కొంతకాలంగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఆమెతో సన్నిహితంగా ఉన్నప్పుడు తీసిన ఫోటోలు, వీడియోలు చూపించి బెదిరించాడు. బాలిక ప్రవర్తనలో మార్పు రావడంతో ఈ విషయాలన్నీ స్కూల్ ప్రిన్సిపల్ తల్లికి ఫిర్యాదు చేశారు. దీంతో తల్లి బాలికను నిలదీయగా ఈ దారుణం బయటపడింది. వెంటనే బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికకు కేజీహెచ్‌కు తరలించి చికిత్స అందించడంతో కోలుకుంది. బాలిక జరిగిన దారుణం గురించి పోలీసులకు చెప్పింది.
బాలికకు డ్రాయింగ్ పేయింటింగ్ నేర్పిస్తానని మాయమాటలు చెప్పి సత్యారావు ఆ బాలికను లొంగదీసుకున్నారని విచారణలో తేలింది. ఈ కేసును దిశ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. సత్యారావుతో పాటుగా అతడి స్నేహితులు కూడా బాలికపై అత్యాచారానికి ఒడిగట్టారని ప్రచారం జరుగుతోంది. సత్యారావు తప్ప ఎవరూ అత్యాచారం చేయలేదని, గ్యాంగ్ రేప్ జరగలేదన్నారు పోలీసులు. ఈ ఘటనపై 376(1),376(డి) ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి సత్యారావును అరెస్ట్ చేశారు. దిశ ఏసీపీ వివేకానంద ఆధ్వర్యంలో విచారణ జరిపిన పోలీసులు బాలికపై సత్యారావు లైంగికదాడికి పాల్పడినట్టు సాక్ష్యాధారాలను సేకరించారు. అతడిని ఫోక్సో చట్టం కింద అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుతం బాలిక చికిత్స పొందుతోందని, సత్యారావు ఒక్కడే లైంగికదాడికి పాల్పడినట్టు తమ దర్యాప్తులో తేలిందని ఏసీపీ చెప్పారు.
Next Story