Mon Dec 23 2024 14:33:29 GMT+0000 (Coordinated Universal Time)
అత్తింటి ఆరళ్లకు..యువతి ఆత్మహత్యాయత్నం
వరంగల్ జిల్లా ఖానాపూర్ గ్రామానికి చెందిన యువతి .. అదే గ్రామానికి చెందిన శరత్ అనే యువకుడు ప్రేమించుకున్నారు. ఇద్దరి..
మనసారా ప్రేమించుకున్నారు. పెద్దల్ని ఎదిరించి ప్రేమ పెళ్లి చేసుకున్నారు. కానీ ఆ తర్వాత ఏర్పడిన పరిణామాలు ఆ యువతి జీవితాన్ని తలకిందులు చేశాయి. వరకట్నం కోసం భర్త- అత్తమామలు వరకట్నం కోసం వేధించడం మొదలుపెట్టారు. వారి వేధింపులు తాళలేక పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయినా ఎలాంటి ఫలితం లేకపోవడంతో ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రస్తుతం ఆ గృహిణి మృత్యువుతో పోరాడుతోంది.
వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ జిల్లా ఖానాపూర్ గ్రామానికి చెందిన యువతి .. అదే గ్రామానికి చెందిన శరత్ అనే యువకుడు ప్రేమించుకున్నారు. ఇద్దరి కులమతాలు వేరు కావడంతో పెద్దలు పెళ్లికి అంగీకరించలేదు. ఇద్దరూ ప్రేమపెళ్లి చేసుకున్నారు. ముస్లిం అయిన యువతి భర్తకోసం మతం మార్చుకుని హిందూత్వాన్ని స్వీకరించింది. కానీ.. వారి ప్రేమపెళ్లి మూన్నాళ్ల ముచ్చటే అయింది. పెళ్లైన కొద్దిరోజులకే వేధింపులు మొదలయ్యాయి. భర్త, అత్తమామలు వరకట్నం కోసం వేధిస్తున్నారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పోలీసుల నుంచి ఎలాంటి న్యాయం లేకపోవడంతో తీవ్రమనస్తాపానికి గురైన యువతి.. ఆడపిల్లలు ప్రేమలో పడి మోసపోవద్దని సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్యకు యత్నించింది. పురుగుల మందు సేవించింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న నూర్జహాన్ ను స్థానికులు గమనించి ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆమె చికిత్స పొందుతోంది. యువతి ఆత్మహత్యాయత్నంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story