ఇస్లాం ప్రకారం ఇది అత్యంత ఘోరమైన నేరం : అసదుద్దీన్ ఒవైసీ
'ఇస్లాం ప్రకారం ఇది అత్యంత ఘోరమైన నేరం' అని ఒవైసీ తెలిపారు. ఈ హత్యకు మతం రంగు పులుముతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
హైదరాబాద్ : నగరంలోని సరూర్‌నగర్ ప్రాంతంలోనాగరాజు హత్యను ఎఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఖండించారు. 'ఇస్లాం ప్రకారం ఇది అత్యంత ఘోరమైన నేరం' అని ఒవైసీ తెలిపారు. ఈ హత్యకు మతం రంగు పులుముతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలకు సంబంధించి మేము హంతకులకు ఎప్పటికీ మద్దతుగా నిలబడమని చెప్పారు. సరూర్‌నగర్‌లో జరిగిన ఘటనను ఖండిస్తున్నామని, ఆ మహిళ ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఆమె భర్తను చంపే హక్కు ఆమె సోదరుడికి లేదని, ఇది రాజ్యాంగం ప్రకారం నేరం, ఇస్లాం ప్రకారం అత్యంత దారుణమైన నేరమని ఒవైసీ అన్నారు.
నిందితుడిని పోలీసులు వెంటనే అరెస్ట్ చేశారు.. హంతకులకు మేం అండగా నిలవడం లేదన్నారు అసదుద్దీన్. ఢిల్లీలోని జహంగీర్‌పురి, మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ వంటి ప్రాంతాలలో జరిగిన హింసాత్మక సంఘటనలపై కూడా ఒవైసీ ప్రస్తావించారు ఏ మతపరమైన ఊరేగింపు జరిగినా, మసీదులపై అధిక రిజల్యూషన్ CCTV ఉండాలి. ఊరేగింపు, రాళ్లు ఎవరు విసురుతున్నారో ప్రపంచానికి తెలియాలంటే ప్రత్యక్ష ప్రసారం చేయాలని అన్నారు. అష్రిన్ సుల్తానా సయ్యద్‌తో వివాహం చేసుకున్న నాగరాజును బుధవారం రాత్రి హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో రద్దీగా ఉండే ప్రాంతంలో హత్య చేశారు. హత్యకు పాల్పడిన మహిళ సోదరుడు ముబిన్ అహ్మద్ సయ్యద్, ఎం మసూద్ అహ్మద్ లను పోలీసులు అరెస్టు చేశారు. నాగరాజు హత్యకు ఉపయోగించిన కత్తి, ఇనుప రాడ్‌ను స్వాధీనం చేసుకున్నారు.