Mon Dec 23 2024 09:48:30 GMT+0000 (Coordinated Universal Time)
బాలిక స్నానం చేస్తుండగా.. కెమెరాలో రికార్డ్ చేసిన నీచపు తండ్రి
ఇటీవలే విజయవాడలో ఓ బాలిక లైంగిక వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో వేధింపుల ఘటన
ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలు, దారుణాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. వావి వరుసలు లేకుండా, చిన్నా - పెద్దా, ముసలి , ముతక తారతమ్యం లేకుండా అబబలపై అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే.. సమాజంలో కామాంధుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. ఆడపిల్లకు ఎక్కడా రక్షణ లేదన్నట్లే తయారైంది సమాజం. చిన్న పిల్లలను ఆడుకునేందుకు కూడా బయటికి పంపాలంటే తల్లిదండ్రులు భయపడుతున్నారు.
Also Read : ఏపీ కరోనా బులెటిన్ : వెయ్యి దిగువకు కొత్తకేసులు
ఇటీవలే విజయవాడలో ఓ బాలిక లైంగిక వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో వేధింపుల ఘటన వెలుగులోకి వచ్చింది. విజయవాడలో ఓ సవతి తండ్రి వరుసకు కూతురయ్యే బాలికపై నీచానికి ఒడిగట్టాడు. బాలిక స్నానం చేస్తుండగా.. రహస్యంగా కెమెరాలో చిత్రీకరించాడు. భర్త చేసిన ఈ నీచపు పనిని గమనించిన భార్య.. వెంటనే అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. విజయవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గట్టు వెెనుక ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story