Mon Dec 23 2024 17:49:59 GMT+0000 (Coordinated Universal Time)
దురంతో ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం
సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళుతుండగా దురంతో రైలుకు ప్రమాదం తప్పింది
సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళుతుండగా దురంతో రైలుకు ప్రమాదం తప్పింది. ఏలూరు జిల్లాలోని భీమడోలు వద్ద పట్టాలపై అడ్డంగా ఉన్న బొలేరో వాహనానని దురంతో రైలు ఢీకొట్టింది. దీంతో వాహనం తుక్కు తుక్కు అయింది. రైలు ఇంజిన్ ముందు భాగం దెబ్బతినింది. దీంతో రైలు ఇంజిన్ మార్చాల్సి రావడంతో పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
రైళ్లన్నీ ఆలస్యం...
ఈరోజు తెల్లవారు జామున ఈ ప్రమాదం జరిగింది. దీంతో ఈ మార్గంలో రైళ్లన్నీ ఆలస్యంగా నడుస్తున్నాయి. భీమడోలు జంక్షన్ వద్ద గేటు వేసినప్పటికీ బోలేరోలో వచ్చిన కొందరు గేట్‌ను ఢీకొట్టి ముందుకు వెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. రైలు సమీపానికి రావడంతో బొలేరోలో ఉన్న వారంతా వాహనం దిగి పరారయ్యారు. దీంతో రైలు ఢీకొట్టింది. మరో ఇంజిన్ మార్చాల్సి రావడంతో రైలు ఆలస్యంగా బయలుదేరింది. రైల్వే పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి నిందితుల కోసం వెదుకుతున్నారు.
Next Story