Mon Dec 23 2024 18:14:24 GMT+0000 (Coordinated Universal Time)
నా భార్య నన్ను ఇష్టం వచ్చినట్లు కొడుతోంది.. రక్షణ కల్పించండి సార్..!
తన భార్య పాన్, కర్ర, క్రికెట్ బ్యాట్‌తో తనపై దాడి చేస్తోందని ప్రిన్సిపాల్ పోలీసు ఫిర్యాదులో పేర్కొన్నాడు. భార్య టార్చర్
రాజస్థాన్ : రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లా భివాడిలో హృదయ విదారకమైన గృహహింస ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ స్కూల్ ప్రిన్సిపాల్ తన భార్య తనను చిత్రహింసలకు గురిచేస్తోందని ఆరోపించారు. ప్రిన్సిపల్‌ను అతని భార్య ప్రతిరోజూ దారుణంగా కొడుతూ ఉంది. ఇంటి నుంచి బయటకు కూడా గెంటివేసేది. ఆ మహిళ తన భర్తను క్రికెట్ బ్యాట్‌తో కొట్టిన సీసీటీవీ ఫుటేజీ వీడియోలు వైరల్ గా మారాయి.
అజిత్ సింగ్ యాదవ్ సోనిపట్ ప్రాంతానికి చెందిన సుమన్ ను 7 సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే భార్య మాత్రం అతడిని విపరీతంగా టార్చర్ చేస్తూ వస్తోంది. దీంతో ప్రిన్సిపల్ ఆధారాలు సేకరించేందుకు ఇంట్లో సీసీటీవీ కెమెరాలను అమర్చారు. తన భార్య బెదిరిస్తూ బ్లాక్మెయిల్ చేస్తోందని ఆ ప్రిన్సిపాల్ రక్షణ కోసం కోర్టును ఆశ్రయించారు. ఆయనకు భద్రత కల్పించాలని కోర్టు ఆదేశించింది.
తన భార్య పాన్, కర్ర, క్రికెట్ బ్యాట్‌తో తనపై దాడి చేస్తోందని ప్రిన్సిపాల్ పోలీసు ఫిర్యాదులో పేర్కొన్నాడు. భార్య టార్చర్ కు విసిగిపోయిన భర్త సాక్ష్యాలను సేకరించేందుకు ఇంట్లో సీసీటీవీ కెమెరాలను అమర్చారు. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న వీడియోలలో ఒకదానిలో, ఆ మహిళ భర్తని క్రికెట్ బ్యాట్‌తో కొడుతుండగా, వారి కొడుకు చూస్తూ ఉన్నాడు. రక్షణ కోసం కోర్టును ఆశ్రయించిన ఆయన ఘటనకు సంబంధించిన ఫుటేజీని సమర్పించాడు. ఆయనకు భద్రత కల్పించాలని కోర్టు ఆదేశించింది.
తరచుగా భార్య హింసిస్తూ ఉంటే.. భర్త అజిత్ సింగ్ కు అనేక గాయాలు అయ్యాయి. ఆ గాయాలను నయం చేసుకోడానికి వైద్య సహాయం కోసం ప్రయత్నిస్తున్నాడు. ఉపాధ్యాయ వృత్తి గౌరవాన్ని దృష్టిలో ఉంచుకుని హింసను సహిస్తున్నట్లు సింగ్ చెప్పాడు. కానీ ఇప్పుడు నా భార్య అన్ని హద్దులు దాటినందున నేను కోర్టును ఆశ్రయించానని అతడు వెల్లడించాడు. నేను ఎప్పుడూ సుమన్‌పై చేయి ఎత్తలేదు. చట్టాన్ని నా చేతుల్లోకి తీసుకోలేదని వాపోయాడు.
Next Story