Sun Dec 22 2024 21:44:16 GMT+0000 (Coordinated Universal Time)
భర్త నాలుకను కొరికేసిన భార్య..
వాళ్లిద్దరికీ మూడేళ్ల క్రితం వివాహమైంది. ఇద్దరి మధ్యన మనస్పర్థలు రావడంతో ఏడాది కాలంగా దూరంగా ఉంటున్నారు.
భార్య భర్తలన్నాక గొడవలు జరగడం సహజం. ఒక్కోసారి ఆ గొడవలే కొన్ని దారుణాలకు దారితీస్తుంది. అలా ఓ భార్య తన భర్తతో జరిగిన గొడవలో భార్య అతని నాలుకను నోటితో కొరికేసింది. యూపీ రాజధాని లక్నోలోని ఠాకూర్ గంజ్ ప్రాంతంలో జరిగిందీ ఘటన. తీవ్రంగా గాయపడిన ఆ భర్తను కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీలోని ట్రామా సెంటర్లో చేర్పించి, నిందుతురాలైన భార్యని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. వాళ్లిద్దరికీ మూడేళ్ల క్రితం వివాహమైంది. ఇద్దరి మధ్యన మనస్పర్థలు రావడంతో ఏడాది కాలంగా దూరంగా ఉంటున్నారు. ఆటోడ్రైవరైన భర్త.. నిన్న రాధాగ్రామ్ లోని భార్య వద్దకు వెళ్లాడు. అయితే.. తన పిల్లల్ని కలవకుండా భార్య అడ్డుకుంది. దాంతో ఇద్దరి మధ్యన వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో అతను భార్యను ఈడ్చిపడేసి దాడి చేయబోగా.. అతడి నుంచి తప్పించుకునే క్రమంలో ఆమె అతడి నాలుకను నోటితో పట్టుకుని గట్టిగా కొరికిపడేసింది.
దాంతో అతనికి తీవ్ర రక్తస్రావం కావడంతో వెంటనే అతడిని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీకి తరలించారు. అతడి నాలుక పై భాగం తీవ్రంగా దెబ్బతిందని మెడికల్ యూనివర్సిటీ ప్లాస్టిక్ విభాగం హెడ్ ప్రొఫెసర్ విజయ్ కుమార్ తెలిపారు. గాయాన్ని శుభ్రం చేసి కుట్లు వేసి నరాన్ని మూసివేసినట్టు చెప్పారు. నాలుకకు అయిన గాయం త్వరగా మానుతుంది కాబట్టి.. అతను త్వరలోనే మాట్లాడుతాడు కానీ.. ఇది వరకులా స్పష్టత ఉండకపోవచ్చని వైద్యులు తెలిపారు.
Next Story