Sun Mar 23 2025 11:21:07 GMT+0000 (Coordinated Universal Time)
SADISTIC HUSBAND : బలవన్మరణానికి పాల్పడుతున్న భార్యను వీడియో తీసిన సైకో భర్త
భర్త ప్రవర్తనతో విసిగిపోయిన షోబిత బలవన్మరణానికి ప్రయత్నించింది. వారింట్లో ఉన్న బెడ్రూమ్ లో సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకుని

ఆడపిల్లలు, మహిళలపై అఘాయిత్యాలకు, నేరాలకు నెలవైన యూపీలో మరో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. కట్టుకున్న భార్య.. కళ్లముందే ప్రాణాలు తీసుకుంటుంటే ఏ భర్త ఇలాంటి పని చేయడేమో. భార్య బలవన్మరణానికి పాల్పడుతుంటే.. అదంతా వీడియో తీసి ఆమె పుట్టింటివారికి పంపాడు ఆ సైకో భర్త. ఈ ఘటన కాన్పూర్ లో చోటుచేసుకుంది. కాన్పూర్ కు చెందిన సంజయ్ గుప్తా, షోబితా గుప్తాలకు నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. కాన్పూర్‌లోనే కాపురం ఉంటున్నారు. ఇటీవల కాలంలో భార్య-భర్తల మధ్య విభేదాలు వచ్చాయి. తరచూ గొడవలు పడుతుండేవారు.
భర్త ప్రవర్తనతో విసిగిపోయిన షోబిత బలవన్మరణానికి ప్రయత్నించింది. వారింట్లో ఉన్న బెడ్రూమ్ లో సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకుని చనిపోయేందుకు ప్రయత్నించింది. ఆ సమయంలో భర్త సంజయ్ అక్కడే ఉన్నా.. ఆమె కనీసం అడ్డుకోలేదు సరికదా.. పైపెచ్చు అదంతా వీడియో తీస్తూ కూర్చున్నాడు. చీరను మెడకు తగిలించుకుని చివరిసారిగా తనవైపు చూసిన షోబితాతో మాట్లాడుతూ.. ఇదన్నమాట నీ మనస్తత్వం. ఇదే నా నీ మైండ్ సెట్.. అని సంజయ్ వ్యాఖ్యానించాడు. సంజయ్ మాటలకు షోబిత ఉరిని తీసేసింది. అక్కడితో వీడియో ముగిసింది. ఆ వీడియోను షోబిత తల్లిదండ్రులకు పంపాడు సంజయ్. దాంతో షోబిత తల్లిదండ్రులు ఉరుకులు పరుగులతో కూతురు ఉంటున్న ఇంటికి చేరుకున్నారు. అప్పటికే బెడ్ మీద చలనంలేకుండా పడిపోయిన షోబితాకు సంజయ్ సీపీఆర్ చేస్తున్నాడు.
తల్లిదండ్రులు ఆమెను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్థారించారు. ఏం జరిగిందని తల్లిదండ్రులను అడగ్గా.. జరిగిందంతా చెప్పారు. షోబితా మానసిక అనారోగ్యంతో ఆత్మహత్యకు పాల్పడిందని, గతంలోనూ ఆత్మహత్యకు ప్రయత్నించిందని సంజయ్ చెప్పాడన్నారు. షోబితా ఉరి వేసుకునే ప్రయత్నం చేస్తుంటే ఆపకుండా ఏం చేస్తున్నావని సంజయ్ పై వాళ్లు మండిపడ్డారు. సంజయ్ పై పోలీసులకు ఫిర్యాదు చేయగా..పోలీసులు అతడిని అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు.
Next Story