Mon Dec 23 2024 07:11:05 GMT+0000 (Coordinated Universal Time)
ఆమెకు 15 మంది బాయ్‌ఫ్రెండ్స్.. ప్రియుడి మోజులో పడి ఏకంగా..
సత్యసాయి జిల్లా హిందూపురానికి చెందిన చంద్రశేఖర్ బెంగళూరు యలహంకలో నివాసం ఉంటున్నాడు. అక్క కూతురు..
ఈ రోజుల్లో ఒక యువతి లేదా యువకుడికి రెండు మూడు లవ్ అఫైర్ లు ఉండటం సహజంగా మారింది. కానీ.. ఓ యువతికి ఒకరు కాదు.. ఇద్దరు కాదు ఏకంగా 15 మంది బాయ్ ఫ్రెండ్స్ ఉండేవారు. ట్రెండ్ అనుకుందో.. ఫ్యాషన్ అనుకుందో.. అన్నీ తెలిసే.. ప్రియుడి మోజులో పడి భర్తను దారుణంగా హతమార్చింది. ఇప్పుడు కటకటాలను లెక్కిస్తోంది. ఈ ఘటన కర్ణాటకలోని బెంగళూరులో వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళ్తే.. సత్యసాయి జిల్లా హిందూపురానికి చెందిన చంద్రశేఖర్ బెంగళూరు యలహంకలో నివాసం ఉంటున్నాడు. అక్క కూతురు శ్వేతాని చంద్రశేఖర్ వివాహం చేసుకున్నాడు.ఐటీ హబ్ బెంగళూరులో చంద్రశేఖర్, శ్వేత దంపతులు నివాసం ఉంటున్నారు. బుధవారం రాత్రి భర్త ఇంటికెళ్లాడు. గురువారం ఉదయానికి టెర్రస్ పై శవమై కనిపించాడు. భర్త మర్మాంగం కోసేసి తల మీద ఎవరో దాడి చేశారంటూ నాటకమాడింది. అతడిని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అతని ప్రాణం పోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు.. కేసునమోదు చేసి శ్వేతను ప్రశ్నించారు. పొంతనలేని సమాధానాలు చెప్తుండటంతో పోలీసులకు అనుమానం వచ్చింది.
ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ చేయగా..జరిగిందంతా బయటకొచ్చింది. కాలేజీరోజుల్లో ఆమెకు 15 మంది బాయ్ ఫ్రెండ్స్ ఉండేవారని, కొన్నిరోజులు షికార్లు చేసిన తరువాత వారిని బ్లాక్ లిస్టులో పెట్టేదని విచారణలో తేలింది. పెళ్లయ్యాక కూడా ఆమె వివాహేతర సంబంధం కొనసాగించింది. హిందూపురం నివాసి సురేష్‌తో చనువుగా ఉండేది. ఈ విషయం భర్తకు తెలియడంతో తరచూ ఇంట్లో గొడవలు జరిగేవి. భర్త బ్రతికి ఉండగా.. సురేష్ ను కలవడం కష్టమని భావించిన శ్వేత.. భర్తను హతమార్చాలని ఫిక్సయింది. ప్రియుడితో కలిసి ప్లాన్ వేసింది. ఇద్దరూ కలిసి చంద్రశేఖర్ ను హతమార్చారు. చంద్రశేఖర్ హత్య కేసులో అతని భార్య శ్వేతా, ఆమె ప్రియుడు సురేష్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Next Story