Mon Dec 23 2024 09:07:20 GMT+0000 (Coordinated Universal Time)
భోజనంలో విషం పెట్టినా భర్త చనిపోలేదని..
గత ఆదివారం మద్యం సేవించి ఇంటికొచ్చిన ఈశ్వర్ (35)కు విషయం కలిపిన భోజనం పెట్టింది. అయినా చనిపోలేదని..
తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను కడతేర్చిందో భార్య. ఈ నెల 3వ తేదీన జరిగిన ఈ హత్య కేసులో నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కర్నూల్ జిల్లా తుగ్గలి మండలం, బాటతండాకు చెందిన ఈశ్వర్ నాయక్ గుత్తిలోని చెర్లోపల్లి కాలనీలో స్థిరపడ్డాడు. అటవీశాఖలో కాంట్రాక్ట్ పద్ధతిలో జీపు డ్రైవర్ గా పనిచేసేవాడు. కోటలోని చెంబులబావి కాలనీకి చెందిన కృష్ణయ్య గుత్తి ప్రభుత్వ ఆస్పత్రిలో సెక్యూరిటీ గార్డుగా పనిచేసేవాడు.
ఈశ్వర్ నాయక్ భార్య ఉమాదేవి బాయితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. వారిద్దరి విషయం ఈశ్వర్ కు తెలియగా.. పద్ధతి మార్చుకోవాలని భార్యను హెచ్చరించాడు. అయినా మార్పు రాకపోగా.. వివాహేతర బంధానికి అడ్డొస్తున్న భర్తను ఎలాగైనా అంతమొందించాలని ఇద్దరూ ప్లాన్ చేశారు. గత ఆదివారం మద్యం సేవించి ఇంటికొచ్చిన ఈశ్వర్ (35)కు విషయం కలిపిన భోజనం పెట్టింది. అయినా చనిపోలేదని.. సోమవారం తెల్లవారుజామున మత్తులో ఉన్న భర్త తలపై రోకలి బండతో మోదింది.
తలకు తీవ్రగాయమైన ఈశ్వర్ ను.. ఏమీ తెలియనట్టు భార్యే ఆస్పత్రికి తీసుకెళ్లింది. అప్పటికే అతను మరణించేశాడు. ఇంట్లో కిందపడటంతో తలకు బలమైన గాయమైనట్లు పోలీసులను నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ.. ఈశ్వర్ నాయక్ తమ్ముడు ఇంద్రసేనా నాయక్ ఫిర్యాదుతో పోలీసులు ఉమాదేవి పై కేసు నమోదు చేశారు. తన అన్నను వదినే హత్య చేసినట్లు అతను తెలిపాడు. శనివారం వీఆర్వో వెంకట రాజేశ్ వద్ద కృష్ణయ్య, ఉమాదేవి లొంగిపోయారు.
Next Story