Sun Dec 22 2024 22:46:50 GMT+0000 (Coordinated Universal Time)
పర స్త్రీ వ్యామోహంలో భర్త.. తలపై సలసల కాగే నూనె పోసిన భార్య
విజయవాడకు చెందిన చెందిన గిరిధర్లాల్, రేణుక దంపతులకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులున్నారు. మూడేళ్ల క్రితం బ్రతుకుదెరువు..
పర స్త్రీ వ్యామోహంలో పడిన ఆ భర్త.. ఇంటిని పట్టించుకోవడం మానేశాడు. తనకు భార్య, పిల్లలు ఉన్నారని, వాళ్ల బాగోగులు చూసుకోవాలన్న సంగతే మరిపోయాడు. భర్తకు ఎంత చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా, ఏ రకంగా చెప్పినా భర్త వినకపోవడంతో విసిగిపోయిన ఆమె.. క్షణికావేశంలో సలసలకాగే వేడి వేడి నూనె భర్త తలపై పోసేసింది. దాంతో అతను తీవ్రగాయాల పాలై.. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని కుల్సుంపురా పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..
విజయవాడకు చెందిన చెందిన గిరిధర్లాల్, రేణుక దంపతులకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులున్నారు. మూడేళ్ల క్రితం బ్రతుకుదెరువు కోసం హైదరాబాద్ లోని జియాగూడకు వచ్చి నివాసం ఉంటున్నారు. మాంసం వ్యాపారం చేసే గిరిధర్ లాల్ జియాగూడ కబేళాలో పనిచేస్తుండేవాడు. కొంత కాలంగా గిరిధర్లాల్ పరాయి స్త్రీల వ్యామోహంలో పడి భార్య, పిల్లలను నిర్లక్ష్యం చేశాడు. ఈ విషయమై మూడ్రోజులుగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. నిన్న కూడా వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. భర్త ప్రవర్తనతో విసిగిపోయిన రేణుక.. ఆవేశంలో వంటింట్లో కడాయిలో ఉన్న వేడి నూనెను భర్త తలపై పోసింది. గిరిధర్లాల్ తల, ఛాతీ, చేతులకు తీవ్ర గాయాలవ్వడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించి అతన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రేణుకను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Next Story